దేవరయాంజల్ భూ కబ్జా ప్రధాన సూత్రధారి దండోర అశోక్.


మేడ్చల్ జిల్లా ,శామీర్ పేట్ మండలం, దేవరయాంజల్ గ్రామం .
దేవరయాంజల్ భూ కబ్జా ప్రధాన సూత్రధారి దండోర అశోక్.
తూముకుంట మున్సిపాలిటీ దేవరయంజాల్ గ్రామంలో సర్వేనెంబర్ 640 దేవుడి భూమి కబ్జా తతంగం మరో మలుపు తిరిగింది.
దేవరయాంజల్ గ్రామానికి చెందిన ప్రధాన సూత్రధారి అయిన దండోర అశోక్ అలియాస్ ఎన్.వై.అశోక్ ఇంతకుముందు కూడా అనేక కేసులో నిందితుడు అని సమాచారం.భూమి కబ్జా చేయడానికి టిఆర్ఎస్ నాయకుల సహాయ సహకారాలు కోరుతూ కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వలసదారుల నుండి గుడిస కు 3 లక్షల నుండి 4 లక్షల వరకు తీసుకుని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని గుడి మీద వేప చెట్టు మరియు వారి తల్లిదండ్రుల మీద ఒట్టు వేయించుకునాడు.దండోరా అశోక్ ప్రధాన అనుచరుడైన పూల్ సింగ్ గుడిసె వాసులలో కొందరు బంధువులే కనుక అందరినీ ఏకం చేశారు.ఎండోమెంట్ అధికారులు ఎంక్వయిరీ చేయడానికి వెళితే కూడా ఆడవారు స్నానం చేస్తూ ఉంటే ఫోటోలు తీస్తున్నారు అని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే గుడిసే వాసులను దండోర అశోక్ ,ఫుల్ సింగ్ ఏ విధంగా తయారు చేస్తున్నారో అర్థమవుతుంది.
ప్రక్కనే ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి ఒక పరిశ్రమకు పెద్ద మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకుందామని పన్నాగం పన్నారు .తెర వెనుక నుండి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ గౌడ్ కొడుకు తూముకుంట కౌన్సిలర్ బోస్ గౌడ్ కోటి రూపాయలు తీసుకుంటున్న ఫుటేజీ చూడండి.దండోర అశోక్ డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.వీరి వెనుక తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ వీరారెడ్డి హస్తం ఉందని బలమైన వాదన .
గతంలో తూముకుంట రాముల వారి గుడి కి చైర్మన్ గా ఉన్నప్పుడు దేవాదాయ భూములు 150 ఎకరాల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం.దేవరయాంజల్ సర్వే నంబర్ 640 భూమిపైన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.వీళ్ళు చేసే పనికి వీళ్లు అనుభవిస్తున్న లగ్జరీ కి సంబంధమే లేకుండాపోయింది అని వీరిపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని స్థానిక ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

About The Author