టీమిండియా లీడ్‌ 249 పరుగులు


చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 249 పరుగల ఆధిక్యం సాధించింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ జట్టు ఇవాళ అశ్విన్‌ స్పిన్‌ ముందు మోకరిల్లింది. కేవలం 134 పరుగులకు ఆలౌటైంది. 129 పరుగులకే ఆలౌట్‌ అయి ఉంటే ఫాలోఆన్‌ ఆడాల్సి ఉండేది. మరో అయిదు పరుగులు చేసి ఫాలోఆన్‌ తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఒక వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. శుభమన్‌ గిల్‌ 14 పరుగులకు ఎల్‌బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రోహిత్‌ శర్మ 25, చేతశ్వర్‌ పూజారా ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 59.5 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 134 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో బెన్ ఫోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 107 బంతులను ఎదుర్కొన్న ఫోక్స్ 4 ఫోర్లు కొట్టాడు. భారత బౌలర్లలో .. అశ్విన్ ఐదు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడ్డాయి. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

About The Author