కేజ్రీవాల్​ కుమార్తె హర్షితకు ఆన్​లైన్​లో మోసం


ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కుమార్తె హర్షితను ఆన్​లైన్​లో మోసం చేసిన ముగ్గురు నిందితులను దిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని సాంకేతిక నిఘా సహాయంతో అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిందితుల్లో సాజిద్​ అనే యువకుడు హరియాణాకు చెందిన వాడు కాగా.. కపిల్​, మన్వీందర్​ సింగ్​ అనే మరో ఇద్దరు యూపీకి చెందిన వారు.

ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న వారిస్​ ఇంకా పరారీలో ఉన్నాడు.

ప్రముఖ ఆన్​లైన్​ కొనుగోలు సంస్థ ఓఎల్​ఎక్స్​లో సోఫాను అమ్మకానికి పెట్టారు హర్షిత. వస్తువును చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు.

ఆ వస్తువులను కొనుగోలు చేసిన అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లిస్తానని చెప్పాడు.

ఈ క్రమంలో నిందితుడు హర్షిత మొబైల్​కు ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్​లో డబ్బు జమ అవుతుందని నమ్మబలికాడు.

ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. అమె ఖాతా నుంచి నిందితుని అకౌంట్​కు నగదు బదిలీ అయిందని పోలీసులు వివరించారు. ఇలా హర్షిత మొత్తం రూ.34 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపారు.

About The Author