ప్రొఫైల్ అమ్మాయిది.. ఛాటింగ్ అబ్బాయిది


ఫేస్ బుక్ లో ప్రతి ప్రొఫైల్ ను గుడ్డిగా నమ్మకూడదు. మరీ ముఖ్యంగా ఏ ప్రొఫైల్ అమ్మాయిదో, ఏది అబ్బాయిదో తెలుసుకోవడం అసాధ్యం. అమ్మాయి పేర్లు, అమ్మాయిల ప్రొఫైల్ పిక్స్ పెట్టుకొని ఛాటింగ్స్ చేసే వాళ్లు, ట్రోలింగ్స్ కు పాల్పడేవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి కేసే.

ప్రొఫైల్ పిక్స్ లో అందమైన అమ్మాయిలు.. కానీ ఆ ఎకౌంట్స్ మాత్రం పూర్తిగా అబ్బాయిలవి. ఈ విషయం తెలియక హైదరాబాద్ లో ఉన్న నలుగురు కుర్రాళ్లు బకరాలయ్యారు. వీళ్లను ముగ్గులోకి దింపిన ”ఫేక్ అమ్మాయిలు” వాళ్ల నుంచి ఏకంగా ఏడున్నర లక్షల రూపాయలు కొట్టేశారు. ఇంతకీ వీళ్లెవరో తెలుసా.. నైజీరియన్లు. ఉండేది కూడా హైదరాబాద్ లోనే.

అమ్మాయిల ఫొటోలతో ఫేస్ బుక్ ఖాతాలు తెరిచారు ఈ నైజీరియన్లు. హైదరాబాద్ కే చెందిన నలుగురు కుర్రాళ్లను ముగ్గులోకి దింపారు. తాము విదేశాల నుంచి రావాలంటే ఫ్లయిట్ చార్జీలకు డబ్బులు కావాలంటూ నలుగురి దగ్గర్నుంచి లక్షలు గుంజారు.

కొన్నాళ్లకు తాము మోసపోయామని తెలుసుకున్న కుర్రాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఈ నైజీరియన్ బ్యాచ్ పై నిఘా వేసి ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు.. తాజా ఫిర్యాదుతో నైజీరియన్లకు అరెస్ట్ చేశారు.

కేవలం ”ఫేక్ ఛాటింగ్” మోసాలే కాకుండా.. సిమ్ క్లోనింగ్, ఓటీపీ చోరీ, నకిలీ సైట్లు లాంటి ఎన్నో ఆన్ లైన్ మోసాలకు వీళ్లు పాల్పడినట్టు విచారణలో తేలింది.

About The Author