భారీగా నకిలీ టీ పొడి పట్టివేత…

భారీగా నకిలీ టీ పొడి పట్టివేత..
సూర్యాపేట: నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 200 కిలోల టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. నెహ్రూ నగర్, ఎన్టీఆర్ నగర్‌కి చెందిన నర్సింహారావు, వెంకటేశ్వరావు కొంతకాలంగా నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారు. ఈ పొడికి రోజ్ కలర్, బెల్లం కలిపి మంచి టీ పొడి అని మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలో రూ.600కు అమ్ముతున్నారు. దీంతో తయారీ స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు.