సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?

సర్వేలతో పాటు ఇదీ అటు వైపే!: 2019లో ఏపీకి ముఖ్యమంతి వైయస్ జగన్?
అమరావతి: 2014లో అతివిశ్వాసంతో ఓడిపోయామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు.
ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్‌లది ఒక్కటే లెక్క!
ఇప్పటికే 2014లో టీడీపీ గెలవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణమని, ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నందున అప్పుడు వారికి పడిన ఓట్లు చీలి తమను విజయం వరిస్తుందని భావిస్తున్నారు. దాంతో పాటు సెంటిమెంట్ చూసినా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు
ఇటీవల పలు జాతీయ సర్వేలు తమ ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. వచ్చే లోకసభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలుస్తుందని కొన్ని, 13 సీట్లు గెలుస్తుందని కొన్ని చెప్పాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం నాలుగు స్థానాల్లో గెలుస్తుందని, దాదాపు పది స్థానాల్లో గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెప్పాయి. ఈ లెక్కన ప్రీపోల్ సర్వేలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి.

About The Author