ప్రవేటీకరణ వద్దు అనే వారు వీటికి సమాధానాలు చెప్పాలి.


1) మనం విదేశాలకు వెళ్ళేప్పుడు గానీ లేదా domestic flight పట్టుకుని వేరే పట్టణానికి వెళ్ళే ప్పుడు గానీ ప్రభుత్వ ఎయిర్ (విమానాలు) బస్సులు పట్టుకోము, కానీ ఎయిరిండియా సంస్థ నష్టపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం..

2) మన Phone లో Airtel, Docomo, V, Jio, సిమ్లే వాడతాం కాని.. BSNL సంస్థని ప్రభుత్వమే నడపాలి.

3) దేశంలో లేదా విదేశాలకి ఏదైనా పంపాలన్న భారతీయ తపాల ని కాదని, Bluedart, DHL. FedEx. XpressBees. Professional వంటి private కొరియర్లని వాడతాం కాని.. తపాల సంస్థని ప్రభుత్వమే నడపాలి.

4) మనం ఉన్న ఊరిలోనే ఉపాది పొందుతున్నా మన పిల్లలని మాత్రం చదువుకోసమని పక్కఊళ్ళో ఉండే ప్రైవేట్స్కూల్లోనే చదివిస్తాం. అయినా పాఠశాల మన ఊళ్ళోనే ఉండాలి దానిని ప్రభుత్వమే నడపాలి.

5) ప్రాణం మీదకు వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రులని నమ్మబుద్ధికాక ప్రవేటి హాస్పిటాల్కే వెళ్ళేందుకు మొగ్గుచూపుతాం.. ఒకవేళ ప్రభుత్వాసుపత్రికే వెళ్ళినా స్వయంగా అందులో పనిచేసే డాక్టర్లే తన ప్రవేట్ క్లినిక్ కి రమ్మని ప్రోత్సాహిస్తాడు. మనమూ ప్రవేట్కి వెళితేనే బాగా చూస్తాడని అక్కడికే వెళతాము గానీ ఇక్కడ ఆ డాక్టర్ని నిలదీయం.. అయినా ప్రభుత్వ ఆసుపత్రులని ప్రభుత్వమే నడపాలి.

6) ప్రభుత్వ బాంక్యుల్లున్నా మనం అత్యథికంగా (HDFC- ICICI- Kotak Mahindra- Axis Bank వంటి ఎన్నో ప్రైవేట్ట్ బ్యాంక్ లతోనే లావాదేవీలు జరుపుతాం.. అయినా బ్యాంకులని ప్రభుత్వమే నడపాలి.

7) రైల్లలో టిక్కెట్టు లేని ప్రయాణం చేస్తాం… (దర్నాలు- పండగల్లో మరీ ఎక్కువ) రైల్వే సంస్థ నష్టాల పాలవుతుంటే.. ప్రవేట్ ట్రావెల్సులో పైస తక్కువైన ఒప్పుకోడు.. అయినా ప్రవేట్ ట్రావెల్స్లోనే వెళతాం. కానీ రైల్వే నష్ట పోకుండా ప్రవేటికరణ చేయకుండా ప్రభుత్వమే నడపాలి.

8) రోడ్ల మరమత్తుకు కోట్ల కాంట్రాక్టులని కొట్తేసి అధికారుల చేతులు తడుపుతు.. అందినకాడికి దన్నుకుంటూ రోడ్డు వేసిన నెలకే రోడ్లలో గుంతలు పడినా పట్టించుకోకుండా రోడ్డున పడి దోచుకుంటాం .. ప్రవేటికరణ చేస్తే దన్నుకోవడానికి దొరకదని రోడ్డెక్కుతాం.

ఇలా చెప్పుకుంటే పోతే పరోక్షంగా మనమే ప్రవేటీ కరణని ప్రోత్సాహిస్తున్నాం.
ఇప్పుడు ప్రవేట్ కంపనీల రాకతో మార్కెట్లో పోటీ పెరగడం వల్ల వినియోగదారుడు ఎలా లాభపడతాడో ఎవరు నష్టపోతారు చూద్దాం మచ్చుకు కొన్ని ఉదాహరణలు.

టెలికాం రంగంలో కేవలం ప్రభుత్వమే ఉన్నప్పుడు

టెలికాం రంగంలోకి ప్రవేటీ పెట్టుబడులు రాక ముందు.. ఫోన్ కావాలంటే (Land line ) దాదాపు 1 ఏడాది నుండి 6 నెలలు పట్టేది. ఇక ఫోన్ వచ్చాక బిల్లు చూసి బెంబేలెత్తే వాళ్లం.. ఎప్పుడైన ఏదైన సాంకేతికపరమైన సమస్యలు వస్తే దానిని సరిచేసేందుకు.. కూడా నెలలు పట్టిన సందర్భాలు ఎన్నో.. ఇక Mobile వచ్చాక incoming calls కి సైతం ఛార్చ్ వేసేవారు..(2002 లో నా వద్ద నోకియా హ్యాండ్ సెట్లో BPL sim ఉండేది outgoing calls కి 2 రూపాయలు చెల్లించినట్లు గుర్తు..అలానే incoming calls కి సైతం 1:80 చెల్లించినట్లు గుర్తుంది నాకు) mobil రంగంలోకి ప్రవేట్ కంపనీలు వచ్చాక.. కాంపిటేషన్ పెరిగి వినియోగదారుడు లాభపడ్డాడు.

టెలికాం రంగంలోకి ప్రవేటీ పెట్టుబడులు వచ్చాక

Phone connection ఇప్పుడు చెపితే ఇంకో గంటలో వచ్చేస్తుంది. పోటీ పెరగడంతో క్రమ క్రమంగా phone bills తగ్గుతు వచ్చాయి. అలానే handsets ధరలు సైతం అమాంతం తగ్గుతు వచ్చాయి.

ఇంటర్నెట్లో కేవలం ప్రభుత్వమే ఉన్నప్పుడు

BSNL మాత్రమే Internet సేవలు అందిస్తున్నప్పుడు Internet browsing లో data transfer rate KPBS లో ఉండేది అందుకు జేబులు చిల్లు పడేల బిల్లులు వచ్చేవి.. (నేను 2000-2004 వరకు Cyber café ని run చేసిన అనుభవంతో చెపుతున్నాను.)

ఇంటర్నెట్ రంగంలోకి ప్రైవేట్ కంపనీలు వచ్చాక

Internet రంగంలో ప్రవేటి కంపనీలు రావడంతో కాంపిటేషన్ పెరిగిపోతు.. data transfer rate KPBS నుండి MBPS లోకి పెరుగుతూ సామాన్యుడు సైతం smart phone వాడుతూ internet వినియోగంతో whatsaap లో మాట్లాడుకునే స్థాయికి వచ్చేశాం .. ఇక్కడ లాభపడింది ఎవరు వినియోగదారులమైన మనమే.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని చాలా రంగాల్లో ప్రవేట్ కంపనీలు వచ్చాక కాంపిటేషన్ పెరిగిపోయి వినియోగదారుడు లాభపడుతున్నాడు. అది గమనించకుండానే ప్రభుత్వ సెక్టరాలు ప్రవేట్ పరం అయిపోతున్నాయి అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. డెబ్బై ఏళ్ళుగా మోదీ ప్రభుత్వం లేదుగా.. 2014 ముందు ప్రభుత్వ సెక్టార్లని ప్రవేట్ పరం చేయలేదా.. 2G కుంబకోనం మర్చిపోయార..?

మరి ఈ ప్రైవేటీకరణ వల్ల ఎవరు నష్టపోతున్నారని ఇలా గగ్గోలు పెడుతున్నారు.???

పనిదొంగలు- రాజకీయనాయకులు- దళారీలు టూకీగా కొన్ని సెక్టర్లా గురించి ..

ఉదాహరణకి ముంబయిలో వస్త్రపరిశ్రమ ఒకప్పుడు బాగుండేది.. పెద్ద పెద్ద మిల్లుల్లో వేల సంఖ్యల్లో కార్మీకులు పనిచేసేవారు.. ఈ మిల్లుల్లో కార్మీక సంఘాలు ఏర్పడ్డాక. పనిదొంగలు కొందరు పదవులు చేపట్టి ప్రోత్సకాల పేరిట పని మానేసి ఉద్యమాలు చేస్తుంటే ఉత్పాదన రావట్లేదని.. యాజమాన్యాలు ఉన్న కంపనీలు మూసేయేగా.. చిన్న చిన్న కంపనీలు కోకల్లలుగా పుట్టుకొచ్చి 8 గంటలు నిజాయితీగా పనిచేసే కార్మీకుడు.. 12-18 గంటల పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఎవరు లాభపడ్డ్రు..? పనిదొంగలు- బద్దకస్తులు కార్మీక నాయకులవడం వల్ల వస్త్రపరిశ్రమలు మూత పడ్డాయి.. లాభపడింది మాత్రం కార్మీనాయకులు.

కొన్ని రాష్టాల్లో విద్యుత్ రంగం గురించి చెప్పుకుంటే.. చిన్న – పెద్ద పరిశ్రమలు అనే తేడలేకుండా అందరు కరెంటు దొంగలే బిల్లు కట్టకపోవడం.. కొందరు అవినీతి అధికారుల సలహాతో మీటర్ రీడింగ్ని తగ్గించి చూపించడం. కరెంటు కట్ చేస్తే ధర్నాలు చేయడం. మీటర్ రీడింగ్లపై కేసులు పెట్టిన అధికారులని టార్కెట్ చేయడం. ఇలా ఈ బాధలు భరించలేని ప్రభుత్వాలు విద్యుత్ని ప్రవేటీకరణ చేయడంతో.. ఇప్పుడు నోర్మూసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. కరెంటు సమస్యలు ఏమున్న కంప్లేట్ చేస్తే అరగంటలో వచ్చేసి సమస్యని సరి చేస్తున్నారు. ఇక్కడ లాభపడుతున్నది ఎవరు.. ? వినియోగదారుడే..

మన హైదరాబాద్ లో పాత బస్తీలో జరుగుతుంది అదే.. బిల్లు కట్టుమనే ధైర్యం ఇటు కచరా కి లేదు. కట్టాలన్న సిగ్గు శరం అక్కడి కొందరి వినియోగదారుల్లో లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు మనం కట్టే ట్యాక్సులతో.. వాళ్లు జల్సాలు చేస్తుంటే అధికారం కోసం కచరా దొర వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు..

మరీ ఈ ప్రవేటీకరణతో ఎవరు నష్ట పోతున్నారంటే.. కార్మీక సంఘాల నేతలు.. ప్రభుత్వ సంస్థల సేవలని లూటీ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రవేటీ కరణ చేస్తే పనిదొంగలకు ఆయా రంగాల్లో స్థానం ఉండదు.. లూటేచేసే వాడిని ప్రవేటీవాడు entertain చేయలేడు. అలా అని ప్రవేటికరణ వల్ల అసలు ఇబ్బందులు లేవా అంటే తప్పకుండా ఉంటాయి.. కానీ జబ్బుతో కాలిని తీసేయాల్సి వచ్చే పేషెంటిని ఖతం చేసేస్తే హాయిగా బతికేస్తాడు అన్నట్లు అవుతుంది.. కదా.
ఇలా స్వార్థ రాజకీయంతో మోదీజీ చేసే ప్రతీ పనిని వక్రీకరిస్తూ జనాలని తప్పుదోవ పట్టించే ప్రబుద్ధుల ప్రభావంలో మనం పడకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారత్ మాతకీ జై.. వందేమతరం…

About The Author