ఒక ముఖ్యమంత్రి తమ్ముడంటే ఎలా ఉండాలి…

యోగి ఆదిత్యనాథ్ సోదరులలో అందరికన్నా చిన్నవాడైన శైలేంద్ర మోహన్ ప్రస్తుతం “ఘర్వాల్ స్కౌట్ యూనిట్” లో సుబేదార్ గా చైనా సరిహద్దు ప్రాంతమైన “మన్న బోర్డర్ ” వద్ద దేశ రక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు … “మన్న” అనేది ఉత్తరాఖండ్ లోని భారతదేశ సరిహద్దుకు చిట్టచివరనున్న అతి చిన్న గ్రామం … 3,200 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్వతాలతో నిండి ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ చైనీస్ సైనికుల చొరబాట్లు ఏక్కువగా ఉంటాయి … ఈ ప్రాంతం సెక్యూరిటీ పరంగా అత్యంత క్లిసతమైన ప్రాంతం కావడంతో విధులు నిర్వర్తించే భారత సైనికులు సంవత్సరం పొడవునా 24 గంటల పాటు గస్తీ తిరుగుతూ ఉంటారు … ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ టుడే న్యూస్ చానల్, సరిహద్దుల వద్ద గస్తీ నిర్వహిస్తున్న శైలేంద్ర మోహన్ ను కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్థావించగా ” ఇది మన మాతృభూమి, మన దేశాన్ని కాపాడుకొవడం కోసం ఏటువంటి త్యాగాలకైనా సిధంగా ఉండాలి.అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాము … ఇది మాకు ఒక చాలెంజ్ లాంటిది” అని ఆయన సమాధానమిచ్చారు … #యోగి_ఆదిత్యనాథ్ గారు ముఖమంత్రి అయిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే శైలేంద్ర మోహన్, యోగి గారిని కలిసారుట … ఈ సంధర్బంగా యోగి గారు శైలేంద్ర మోహన్ తో ” మనం ఖచ్చితంగా మాతృభూమి ఋణం తీర్చుకొవాలి. నీ సామర్ధ్యం ఉన్నంతవరకు దేశ సేవకు అంకితమై ఉండు. ఒకరి సిఫార్సుల మీద ఆధారపడకుందా కేవలం నీ శక్తి సామర్ధ్యాల మీదనే నమ్మకముంచి పనిచెయ్యి” అని చెప్పారట యోగి!!

About The Author