వారం రోజుల్లో 13 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు…


వారం రోజుల్లో 13 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు… ప్రాణాలు కోల్పోయారు… బోలెడు మంది దాని బారినపడి కష్టమ్మీద బయటపడ్డారు… పదే పదే ఫస్ట్ నుంచీ చెబుతున్నది ఇదే… ఈ గడ్డు దినాల్లో అంగీలు చింపుకోకండి… ప్రాణాలకు మించి ఏమీ లేదు… మీ కుటుంబాలకు మించి ఏమీ లేదు… ఇది గాకపోతే మరొకటి… బతికుంటే బలుసాకు తినొచ్చు… ఈ సొసైటీకి, ఈ సర్కార్లకు, ఈ యాజమాన్యాలకు పూచికపుల్ల పాటి కాదు జర్నలిస్టుల జీవితాలు… నిజం ఎప్పుడూ కఠినం, నిష్ఠురం… కానీ నిజం నిజమే…!!
.
విపత్తు వేళల్లో ఇండియన్ మీడియా ఏమాత్రం సహాయకారి కాదు, పైగా ప్రమాదకారి… మీడియా ఉద్దరించేది ఏమీ లేదు… రోజూ చూస్తున్నదే… మరి ఆ దరిద్రానికి మీరు ప్రాణాలకు తెగించి పనిచేయడం కూడా శుద్ధ దండుగే కదా… జాగ్రత్తగా పనిచేయండి, చేయించుకుంటే వాడిష్టం, వద్దనుకుంటే వాడి ఖర్మ…. రిస్క్ తీసుకోకండి… యాడ్స్ కోసం పాలకుడి కాళ్ల మీద పడి, పాకులాడే దరిద్రపు మీడియా యజమానుల కోసం మీ ప్రాణాలెందుకు బలిపెట్టాలి..? ఆలోచించండి…. మీకూ పిల్లలున్నారు…. బహుపరాక్…
============================

Telangana & Ap 13Members
1.K Amarnath, senior journalist, Hyderabad, Telangana (April 20)
2.Jayaprakash, journalist, Karimnagar District, Telangana (April 13)
3.Srinivas, reporter, Andhra Jyothi Telugu Daily, Yacharam, Rangareddy District, Telangana (April 16)
4.Sainath, reporter, 99tv, Nirmal District, Telangana (April 17)
5.D Ashok, reporter, Andhra Bhoomi, Nizamabad District, Telangana (April 17)
6.Bura Ramesh, journalist, Vemulawada, Sircilla District, Telangana (April 20)
7.P Ramesh, journalist, Karimnagar, Telangana (April 20)
8.Ch Naga Raju, reporter, Eenadu, Siddipet District, Telangana (April 21).
9.Ramachandra Rao, sub-editor, Sakshi, Hyderabad, Telangana (April 21)
10.Kalpana, CEO, Bathukamma TV, Hyderabad, Telangana (April 21)
11.P Tataiah, senior journalist, Ongole, Andhra Pradesh (April 22)
12.Chandrashekar Naidu, reporter, NTV Srikakulam, Andhra Pradesh (April 22)
13.Srinivasa Rao, reporter, Prajashakti Daily, Jaggaiahpet, Krishna District, Andhra Pradesh (April 22)

….
(వీళ్ల మృతికి నిజంగా ఓ కన్నీటి బొట్టు రాల్చింది ఎవరయ్యా అంటే తోటి జర్నలిస్టులే… వీళ్లు గాకుండా ఇంకెవరైనా ఈమధ్య కాలంలో ప్రాణాలు వదిలి ఉంటే వాళ్లకు నివాళి….)

About The Author