చిత్తూరు జిల్లా లో భారీ ఎత్తున మద్యం, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం…


చిత్తూరు జిల్లా లో భారీ ఎత్తున మద్యం, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం మరియు 5 మంది అరెస్ట్.
సుమారు 50 లక్షల విలువైన 9000 బాటిల్ ల అక్రమ మద్యం, 48 వేల ప్యాకెట్ ల పొగాకు ఉత్పత్తులు (గుట్కా, విమల్ పాన్ మసాలా), ఒక కారు, ఒక ట్రాక్టర్ స్వాధీనం.

చిత్తూరు జిల్లా యస్.పి శ్రీ ఎస్.సెంథిల్ కుమార్ IPS వారి ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్.పి., అడ్మిన్ శ్రీ D.N.మహేష్ గారి స్వీయ పర్యవేక్షణలో చిత్తూరు డి.యస్.పి శ్రీ సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం పై నిరంతర నిఘా, దాడులు జరుగుచున్నవి. ఈ కార్యచారణంలో భాగంగా 02/03-06-2021 వ తేదిన రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ బాలయ్య పర్యవేక్షణ లో తవణంపల్లి SI, శ్రీ K.రాజశేఖర్, జి.డి.నెల్లూరు SI శ్రీ వి.సుమన్ మరియు సిబ్బంది వారి వారి పోలీసు స్టేషన్ పరిధులలో దాడులు నిర్వహించి సుమారు 50 లక్షల విలువైన 9000 బాటిల్ ల అక్రమ మద్యం, 48 వేల ప్యాకెట్ ల పొగాకు ఉత్పత్తులు (గుట్కా, విమల్ పాన్ మసాలా), ఒక కారు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుచున్నది.

తవణంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో

తవణంపల్లి మండలం, సాయి నగర్ (సాయి సామ్రాట్) వద్ద గల “Sri Sai Charitable Trust” కి సంబందించిన ఒక గోడౌన్ వద్ద దాడులు నిర్వహించి ప్రస్తుత మార్కెట్ లో సుమారు 10,00,000/- విలువ చేసే గోవా రాష్ట్రానికి చెందిన 3552 “Royal Black Premium Doctor’s Brandy” 180 ML మద్యం బాటిళ్ళు మరియు సుమారు 15,00,000/- విలువ చేసే 42 వేల Hans (గుట్కా) pouches (14 గోతం సంచుల Hans) మరియు 6 వేల Vimal Pan Masala Pouches (01 గోతం సంచి Vimal Pan Masala Pouches) లను మరియు సదరు మద్యం గుట్కాలను తరలించుటకు ఉపయోగిస్తున్న Omni E కార్ ను స్వాధీనం చేసుకోవడమైనది.

అరెస్టు కాబడిన ముద్దాయిలు:

1. R.సురేష్ బాబు, వయస్సు 37 సం”లు, S/o R.మనోహర్ నాయుడు, మిట్ట ఇండ్లు గ్రామం, వడ్రాంపల్లి పంచాయతీ, ఐరాల మండలం.
ఇతని పై గతంలో మద్యం మరియు పొగాకు ఉత్పత్తులు అక్రమ రవాణా పై తవనంపల్లె పోలీసు స్టేషన్ నందు 3 కేసులు మరియు పుంగనూరు పోలీసు స్టేషన్ నందు 1 కేసు నమోదు కాబడి ఉన్నవి.
2. K.పూర్ణచంద్ర, వయస్సు 31 సం”లు, S/o late K.మొగిలీస్వర నాయుడు, 3rd D Cross, 7th Main, Shree Maruthi Layout, Uttarahalli, Bangalore ( స్వగ్రామం చింతగుంపల పల్లి గ్రామం, ఐరాల మండలం)
3. S.ఖలీల్, వయస్సు 34 సం”లు, S/o కలేషా, మైలవారిపల్లి గ్రామం, తవణంపల్లి మండలం
జి.డి.నెల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో

పాతపల్యం గ్రామం, జి.డి.నెల్లూరు (మం.) కు చెందినా మణి నాయుడు కు చెందినా పొలాల యందు దాడులు నిర్వహించి ప్రస్తుత మార్కెట్ లో సుమారు రూ. 24,15,000/- విలువ చేసే 3,818 Nos of 180 ml Silver cup VSOP, Old Admiral VSOP మద్యం బాటిళ్ళు మరియు ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకోవడమైనది.

అరెస్టు కాబడిన ముద్దాయిలు:

1. వి.సుధాకర్ నాయుడు, వయస్సు 26 సం., S/o వి.మణి నాయుడు, వేణుగోపాలపురం గ్రామం, h/o పాతపల్యం గ్రామం, జి.డి.నెల్లూరు (మం.)
ఇతని పై గతంలో మద్యం అక్రమ రవాణా పై పలమనేరు మరియు చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్ నందు రెండు కేసులు నమోదు కాబడి ఉన్నవి.
2. వి.కుమారస్వామి నాయుడు, వయస్సు 36 సం., S/o వి.మణి నాయుడు, వేణుగోపాలపురం గ్రామం, h/o పాతపల్యం గ్రామం, జి.డి.నెల్లూరు (మం.)

About The Author