కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు


… జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివశంకర్

కృష్ణా జిల్లాలో 82 హాస్పిటల్స్ లో కోవిడ్ చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ వర్తింపు ఇవ్వడం జరిగిందని జెసి,జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే 33 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగులకు చికిత్స,రోగులు లేనందున వాటికిచ్చిన అనుమతులు రద్దు చేయడమైనదన్నారు.

ఇందులో భాగంగా జూన్ 3వ తేదీన 20 ఆస్పత్రులకు, జూన్ 5 వ తేదీన మరో 13 ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ సేవల అనుమతులు రద్దు చేయడం జరిగిందన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను గుర్తించి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందిoచేందుకు జిల్లా యంత్రాంగం పనిచేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద 6 వేల పడకలు, కోవిడ్ కేర్ సెంటర్లో 3 వేల పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

About The Author