మూమెంట్ రిజిస్టర్ ను సక్రమంగా నమోదు చేయకపోతే ఎలా..


-జుటూరు, పసులూరు గ్రామ సచివాలయలు ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
– నలుగురు సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటిసులు
– విధులకు సక్రమంగా హాజరు కానీ వలంటీర్ల పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

సచివాలయాల నందు మూమెంట్ రిజిస్టర్ ను సక్రమంగా నమోదు చేయకపోతే ఎలా………. ఉద్యోగులు సచివాలయాల నందు ఉద్యోగాలు చేయడానికే వస్తున్నారా ……….? ఆఫీస్ నందు రికార్డులను సక్రమంగా నమోదు చెయ్యలేక పోతే మీరు ప్రజలకు ఎం సేవ చేస్తారు ……? అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సచివాలయ ఉద్యోగుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం పెద్దపప్పూరు మండలం పరిధిలోని జుటూరు, పసులూరు  గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అయితే ఆయా సచివాలయంలో నందు మూమెంట్ రిజిస్టర్,  ఉద్యోగుల హాజరు పట్టిక వివరాలు సక్రమంగా లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాని నలుగురు సచివాలయ ఉద్యోగులకు( ఇద్దరు జుటూరు, మరో ఇద్దరు పసులూరు గ్రామ సచివాలయాల  ఉద్యోగులు) షోకాజ్ నోటీసులను అందజేయాలని, విధుల పట్ల నిర్లక్యంగా ఉన్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని పెద్దపప్పూరు మండల అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేయండి:
కులం మతం పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. సచివాలయ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆయన ఆయా సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని,  ఎవరికైనా అర్హత ఉంది ఏదైనా ప్రభుత్వ పథకం అందడం లేదని కానీ, ఎక్కడైనా అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేసారు.

About The Author