పేదలు కట్టుకునే ఇళ్ళు సహకారాన్ని అందించండి..ప్రభుత్వ విప్
జగనన్న కాలనీల్లో జేసిబిలు, కంకర, ఒరలు, సిమెంట్ ఇటుకలు అందుబాటులోకి … ప్రభుత్వ విప్
తిరుపతి, జులై 26: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలో 13 వేల ఇళ్ళ నిర్మాణాలకు అన్నిరకాల సౌకర్యాలు అందేలా చూడాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జగనన్న ఇళ్ల నిర్మాణా ల పై ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆర్డిఓ కనకనరసా రెడ్డి, ఓఎస్డి కిరణ్ కుమార్, అధికారులతో , ఇళ్ళ నిర్మాణా లకు అవసరమయ్యే మెటీరియల్ కాలనీల్లో అందుబాటులో ఉంచేందుకు సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో చేపటుతున్న ఇళ్ళ నిర్మాణాలు పేదల కోసం అన్నది గుర్తించి అధికారులు జెసిబిలు, ఇటుకలు, కంకర వంటివి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మీ అంగీకార ధరలు కాలనీల్లో రేట్ల వివరాలు అందుబాటులో ఉంచనున్నామని అన్నారు
ఇందులో పేదలే స్వయంగా 8500 గృహాలు నిర్మించుకొనున్నారని వారికోసం సిండికేట్ కాకుండా జేసిబి లు, మెటీరియల్ వంటివి కాలనీల వద్దే అందుబాటులో ఉంచేందుకు సహరించాలని ప్రవేట్ ఆపరేటర్ లకు సూచించారు.
పేదలకు ప్రభుత్వ చెల్లించే మొత్తంలో వారు మీకు సూచించిన రేట్లు మీకు చెల్లిస్తారని తెలిపారు. మీరు మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడికక్కడే స్థలం , టెంట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రాథమిక అంచనా మేరకు ఒక్కొక్క ఇంటికి 4x4x 4 పిల్లర్లకోసం 9 గుంతలు, 3×3 లోతు 5 అడుగులు నీటి సంప్ కోసం గుంతలు జేసిబి పనులు, కంకర 40 ఎం.ఎం. ఒక యూనిట్, 20 ఎం.ఎం. 4 యూనిట్లు, సిమెంట్ ఇటుకలు 1600 వందలు అవసరమని సూచించారు. ఆర్డిఓ మాట్లాడుతూ ప్రభుత్వం లబ్దిదారులకు అందించే మొత్తం రూ.1.80 లక్షలు అనేది గుర్తించి సహరించాలని సూచించారు. అన్ని సౌకర్యాలు పేదలకు కాలనీల్లో అందించాలనే ప్రభుత్వ విప్ ఆలోచనకు ధన్యవాదాలని, జేసిబి యజమానులు, కంకర, ఒరలు, ఇటుకలు సరఫరా చేసే ప్రవేట్ వ్యక్తులు సహకారం అందించాలని, మూడునెలల్లో పూర్తి కావాలనే లక్ష్యంగా వున్నామని తెలిపారు.
ఈ సమీక్ష లో నియోజకవర్గ తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, తుడా ఎల్.ఏ.ఓ, గృహ నిర్మాణానికి సంబంధించిన యజమానులు పాల్గొన్నారు.