తల్లి గర్భంలో నే గర్భం దాల్చిన శిశువు
భూమిపైన రోజుకో వింత జరుగుతుంది. ఎవరూ ఊహించని రీతిలో… ప్రపంచంలోని ఒక్కో మూలాన.. ఒక్కో వింత చోటుచేసుకుంది. అయితే తాజాగా వైద్యరంగం లోనే… మరో అద్భుతం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే.. గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నవజాత శిశువులో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం కొసమెరుపు.ఈ ఘటన ఇజ్రాయిల్ దేశం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్ దేశంలోని అష్ దొడ్ పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఒక మహిళ ఆడశిశువుకు ఈ నెల తొలి వారంలో జన్మనిచ్చింది. అయితే ప్రసవ సమయానికి ముందు గర్భిణికి అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపారు.
గర్భంలోని ఆడ శిశువు పొట్ట భాగం సాధారణంగా ఉండవలసిన.. పరిమాణం కంటే కాస్త ఎక్కువగా ఉండడం వైద్యులు గమనించారు. అయితే ప్రసవం అనంతరం ఆ చిన్నారికి అల్ట్రాసౌండ్ మరియు ఎక్స్ రే పరీక్షలు జరిపారు వైద్యులు. ఆ నవజాతశిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు వైద్యులు. దీంతో ఆ వైద్యులు షాక్ కు గురయ్యారు. చేసేదేమీలేక వెంటనే చిన్నారికి సర్జరీ చేసి ఆ పిండాలను తీసేశారు.