కోవిడ్ కట్టడికి వైధ్యసిబ్బంది పర్యవేక్షణ పెరగాలి…కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్

తిరుపతి నగరపాలక సంస్థ

*కోవిడ్ కేసులు పెరగకుండా థర్డ్ వేవును సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటె వైధ్యసిబ్బంది పర్యవేక్షణ పెరగాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ అన్నారు.*

*తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మునిసిపల్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరికృష్ణ సమన్వయంలో నగరపాలక సంస్థ ప్రైమరి హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫిసర్లతో కమిషనర్ గిరీష చర్చించడం జరిగింది.*

*తిరుపతిలో స్వల్పంగ పెరుగుతున్న కోవీడ్ పాజిటివ్ కేసుల కట్టడికి ప్రధానంగా వైధ్యసిబ్బంది కృషి చేయాలన్నారు.ప్రతిరోజు వంద టెస్టులన్నా ప్రతి ఓక్క పి.హెచ్.సిలో తప్పనిసరిగా చేసేలా చూడాలన్నారు. ప్రాధమిక లక్షణాలు ఎవ్వరికైన కనిపిస్తే సరైన జాగ్రత్తలు తీసుకొని పరిక్షలు నిర్వహించాలని,ఓకవేల పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన వ్యక్తులను వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ కి పంపించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరి కాంటాక్ట్ ల వివరాలు ఖచ్చితంగ సేకరించి వారందరికి టెస్టులు చేయించాలన్నారు. మాస్కులు దరించని వారికి జరిమాన విదించేలా మెడికల్ ఆఫిసర్లకు అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ బ్లీచింగ్,రసాయానాలను చల్లించేలా చూడాలన్నారు.కరోనా సాధరణం అయ్యిందిలే అనే నిర్లక్ష్యంలో వున్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముఖ్యంగ వ్యాక్సిన్లు  వేసుకునేలా చూడాలన్నారు.*

*ఈ సమావేశంలో కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్,నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హరికృష్ణ,పి.హెచ్.సి మెడికల్ ఆఫిసర్లు డాక్టర్లు ఎం.ప్రియాంక,సౌజన్య,పవిత్ర,భావన,వెన్నెల సాహితి,టి.ప్రియాంక,ప్రవీణా,అన్వేష్ కుమార్,శివా,రాజేష్,జయంత్ పాల్గొన్నారు.

About The Author