తిరుపతి అర్బన్ జిల్లా,75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను బలిదానం చేశారు.* 

*నాటి మహనీయులు త్యాగ ఫలితంగా, నేడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకగలుగుతున్నాము.*

*తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…*

చిత్తూరు జిల్లా:75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి యం.ఆర్ పల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు స్వాతంత్ర్య వేడుకలు ఘణంగా జరిగింది. ఈ వేడుకులకు ముఖ్య అతిధిగా తిరుపతి  అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు హాజరై, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సిబ్బందికి విచ్చేసిన ప్రజలకు, పాత్రికేయులకు, యావన్మందికి 75 వ  స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ 200 సంవత్సరాల పరదేశి పాలన నుండి, మనకు స్వతంత్రం  సిద్ధించి, 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. నాటి మహనీయులు త్యాగ ఫలితంగా, నేడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకగలుగుతున్నాము. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, జీవితాన్ని పణంగా పెట్టి, విలువైన దేశాన్ని అందజేసారు మన జాతీయ నాయకులన్నారు.

 

మనకు ఇచ్చిన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను, గౌరవిస్తూ మన దేశ సంపద పరిరక్షణకు, బాధ్యతగా పని చేయాలి. మహనీయులు త్యాగ ఫలం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. సమాజంలో సాటి మనిషిని గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ, జాతి మీద మనకున్న భాద్యతలను నిర్వర్తిస్తూ, 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొంటూ ప్రజల సేవకు పునరంకితమవుతున్నాము. స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశ ప్రగతిలో మన పోలీసుల పాత్ర మరవలేనిది. ఈ సంవత్సరము తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో మన పోలీస్ యంత్రాంగం చేసిన విశేష కృషి ఫలితంగా ఎన్నో అంశాల్లో ప్రగతి సాధించగలిగామని తెలిపారు.75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశం ముందుకు సాగాలంటే వ్యవసాయం, పారిశ్రామిక సేవారంగం మరింత ప్రగతిని సాధించాలి. ఈ ప్రగతికి రక్షణ రంగం తోడ్పాటు అందించవలసిన అవసరం ఉంది. ఇందులో భారత సైన్యంతో నమానంగా పోలీసు వారికి కూడా భాద్యత కలిగి ఉన్నామని తెలిపారు.

 ప్రజలు ఇచ్చు ఫిర్యాదులకు సత్వరమే స్పందించి తగిన న్యాయం చేకూర్చటం. కేసులను సకాలంలో ముగించటం, మహిళా, శిశు మరియు బలహీన వర్గాలకై పాటుపడటం, ప్రజల శాంతి భద్రతలు, ఆస్తులను కాపాడటం, అలుపెరగక శ్రమిస్తున్నామన్నారు.మనం ఈ రోజు ప్రతిజ్ఞ చేసి మాట నిలుపుకోవటం మన భాద్యతగా గుర్తు చేస్తున్నా. అదే దేశం కోశం ప్రాణం విడిచిన సైనికులకి, స్వాతంత్ర్య సమరయోధులకి మనమిచ్చే గొప్ప నివాళి.  

తదుపరి కార్యక్రమంలో పోలీస్ మైదానం నందు పోలీస్ డాగ్ స్క్వార్డ్, బాంబ్ స్క్వాడ్ విన్యాసాలతొ పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనుబరచిన అధికారులకు, సిబ్బందికి, డి.పి.ఓ సిబ్బందికి ఉత్తమ సేవా పతకాలు, సేవా పతకాలు  మరియు అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పతకాల, ప్రశంసా పత్రాలు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

About The Author