బీటెక్ విద్యార్థిని రమ్య ను హత్య చేసిన ప్రేమోన్మాది శశి కృష్ణ ను కఠినంగా శిక్షించాలి !


అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన .

 ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ .

బీటెక్ విద్యార్థిని రమ్యను అతికిరాతకంగా నడిరోడ్డుపై పట్టపగలు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది శశి కృష్ణను  కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం హెడ్ క్వార్టర్ లో నిన్న జరిగిన రమ్య హత్యను ఖండిస్తూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్,  ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య,  ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ 75 వ స్వాతంత్ర వేడుకలు ఓ పక్క ఘనంగా జరుపుకుంటూ మరోపక్క మహిళలకు రక్షణ లేకుండా పోవడం అత్యంత దారుణమని పాలకులు ఏర్పాటు చేసినటువంటి నిర్భయ , దిశ చట్టాలు  ఏమయ్యాయని ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు . రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు అండగా ఉంటానని నేడు మహిళలకు రక్షణ లేకపోవడం అత్యంత బాధాకరం అన్నారు అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం అని ఆనాడు గాంధీ గారు అన్నారు కానీ నేడు పట్టపగలు కూడా మహిళలు రోడ్డు మీదకి రా లేనటువంటి పరిస్థితి రావడం అందుకు గుంటూరు జిల్లా పెదకాకాని లో జరిగినటువంటి దారుణ హత్య నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బీటెక్ విద్యార్థిని రమ్య హత్య విద్యార్థి లోకానికి తీరని శోకంగా మిగిల్చిందని జులాయి గా తిరిగే  శశి కృష్ణను కఠినంగా శిక్షించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చిత్తశద్ధితో వ్యవహరించాలని కోరారు. రమ్య  కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అదే విధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

 ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం మంజుల, బి . నదియా ,  మహిళా నాయకురాలు ప్రమీల,  అలివేలు ,  మనెమ్మ.  ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు ఎం రామకృష్ణ , ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు  వెంకటేశ్వర్లు , డి రామచంద్రయ్య ,చైతన్య,  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య దళిత హక్కుల పోరాట సమితి నగర అధ్యక్షులు బి నాగభూషణం గురవయ్య ముని తదితరులు పాల్గొన్నారు

About The Author