జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం

మొక్కలను నాట డం తో పాటు వాటి సంరక్షణా బాధ్యతపై ప్రత్యేక దృష్టి సారించండి* 

 *అవసరమైన చోట ట్రీ గార్డ్ ఏర్పాటు చేయండి* 

 *చెట్ల పెంపకం పై సర్పంచులు పూర్తి బాద్యత తీసు కోవాలి* 

*మన ఊరు – మన చెట్లు , మన రోడ్లు- మన చెట్లు అనే భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించు కోవాలి* 

 : *గౌ.రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు*

తిరుపతి, ఆగష్టు 17: జగనన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద రాష్ట్ర

వ్యాప్తంగా ఈ నెలాఖరు లోపు కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని

గౌ.రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు  పెద్దిరెడ్డి

రామచంద్రా రెడ్డి డ్వామా  ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం ఉదయం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్

నుండి 13 జిల్లాల డ్వామా  ప్రాజెక్టు డైరెక్టర్లు, ఎ.పి.డీ. లతో వీడియో

కాన్ఫెరెన్స్ ద్వారా జగనన్న పచ్చతోరణంపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో

కాన్ఫెరెన్స్ కు విజయవాడ  పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  కార్యాలయం

నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్,

స్పెషల్ కమీషనర్ నవీన్ కుమార్, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ డైరెక్టర్ చిన

తాతయ్య ,  సంబంధిత అధికారులు పాల్గొనగా,  తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి

మంత్రి వర్యులతో పాటు ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం.

విశ్వనాధ్, డ్వామా పీడీ చంద్రశేఖర్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు

మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ

నేలాఖరకు కోటి మొక్కలను నాటి రికార్డు సృష్టించాలని తెలిపారు.  జగనన్న

పచ్చతోరణం కార్యక్రమం క్రింద అనుకున్న ఫలితాలు తీసుకొని వచ్చే విధంగా

కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  గారికి ఇష్టమైన కార్యక్రమముగా ఈ

ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నాటిన

చెట్లవల్ల పచ్చదనం పెంపొందేలా  చర్యలు చేపట్టాలని తెలిపారు.  జగనన్న

పచ్చతోరణం కార్యక్రమం ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందనన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా  ఈ కార్యక్రమం క్రింద ఈ  నెల 15 వ తేదీ నాటికి  45.5

లక్షల పిట్స్ కొట్టారని, 16.6 లక్షల మొక్కలు నాటారని తెలిపారు. గ్రామాలలో

39.4 లక్షల మొక్కలు నాటడానికి  ఇప్పటివరకు 31.5 లక్షల పిట్స్ కొట్టారని

అలాగే 11.8 లక్షల మొక్కలు నాటారని ఇదే స్పూర్తితో కొనసాగితే మన

లక్ష్యాన్ని చేరవచ్చని తెలిపారు. మన ముఖ్యమంత్రి ఈ ఉపాధి హామీ కార్యక్రమం

ద్వారా కోటి మొక్కలు నాటడానికి సంకల్పించారని అదే ఆశయంతో మనం పనిచేసి ఈ

నెలాఖరులోపు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్ని

జిల్లాలకు చెందిన పీడీ లను, వారి సిబ్బందిని  ఆదేశించారు. ప్రతి మొక్కకు

అవసరమైన చోట ట్రీ గార్డ్ పెట్టాలని , పశువులు, గొర్రెలతో ఇబ్బంది ఉన్న

చోట ఖచ్చితంగా ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని,  2020 లో  చట్టం చేసి

సర్పంచు లకు 100 శాతం చెట్లు పెంపకం  బాద్యత అప్పగించి  రోడ్డుకు

ఇరువైపులా చెట్లు నాటడం తో పాటు , ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ

భూముల్లో చెట్లు నాటేందుకు మరియు వాటిని సంరక్షించేందుకు ప్రతి సర్పంచు

బాద్యత తీసుకోవాలని తెలిపారు. క్షేత్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు

ప్లాంటేషన్ పై  ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు పీడీ లకు బాద్యత వహించాలని

తెలిపారు. ప్రస్తుతం ఫారెస్ట్ నర్సరీల నుండి మొక్కలను పొందుతున్నామని

దీనితో పాటు  మన నర్సరీలను మనం  సంసిద్ధం చేసుకోవాలని , భవిష్యత్తు లో  ఈ

నర్సరీలు ద్వారా చెట్ల సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నర్సరీల

పెంపకం బాద్యతను పీడీ లు తీసుకోవాలని ఆదేశించారు.   చెట్లు చనిపోతే

అందుకు బాద్యులైన వారిపై చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించి

అన్ని జిల్లాలకు పంపాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ని ఆదేశించారు. పచ్చదనం

పెంపొందడం ద్వారా  ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని తద్వారా  ఆరోగ్య

సమస్యలు తగ్గుతాయని, 33 శాతం పచ్చదనం ఉండడం ద్వారా మనుషులు  , జంతువులు

రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు.   కోవిడ్ తో  రెండు సంవత్సరాలుగా

ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అతలాకుతలం అయ్యాయని ఇలాంటి జబ్బులు ఎప్పుడు

వచ్చినా ఎదుర్కోవడానికి ఆధారం  33 శాతం పచ్చదనంను  పెంపొందింకుకోవడమేనని

తద్వారా అవసరమైనంత ఆక్సిజన్ అందుతుందని తెలిపారు. చెట్ల పెంపకంను ఒక

బాద్యతగా కాకుండా ఒక హాబీగా ఏర్పరుచుకోవాలన్నారు. మన ఊరు – మన చెట్లు ,

మన రోడ్లు- మన చెట్లు అనే భావనను ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలన్నారు.

About The Author