తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎటువంటి చోటు లేదు
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…*
*హత్య కుట్ర భగ్నం.*
*తిరుపతి పట్టణము నందు సంచలనము రేపిన ఒక హత్య కేసులో ప్రముఖ పాత్ర పోషించిన ఒక రౌడీ షీటర్ ను హత్య చేయుటకు కుట్ర పన్నిన రౌడీ ముఠా అరెస్ట్.*
*హత్య కొరకు సమకూర్చుకున్న కత్తులు/మారణాయుధాలు స్వాధీనం.
దొంగలించిన సుమారు 7.5 లక్షల విలువైన 08 ద్విచక్ర వాహనాలు, LAPTOP, 1200 గ్రాముల గంజాయి, హ్యాండ్ గ్లౌజు, నైట్రోవిట్ టాబ్లెట్స్ మరియు ఒక సెల్ ఫోను స్వాధీనము.*
క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రతి ఒక్కరిని మార్చడానికి మరియు మారడానికి అవకాశం ఇస్తుంది.
*తీరు మారనప్పుడు వారిమీద నిఘా పెట్టడం జరిగుతుంది.*
*క్రిమినల్ నేరాలకు పాల్పడే వారందరిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.
*తల్లిదండ్రులు లేకపోవడం, జులాయిగా తిరగడం, మత్తు పదార్థాలకు అలవాటుపడటం వంటి కారణాల వల్ల చాలా వరకు యువకులు చెడు అలవాటుకు భానిసై నేరాలకు పాల్పడుతున్నారు.*
*మత్తులో ఉన్నప్పుడే నేరపూరితమైన ఆలోచనలు వస్తుంది.
*జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో భహిరంగ ప్రదేశాలలో మత్తు పదార్థాలు సేవించు వారిని డ్రోన్ కేమరాల ద్వారా గుర్తించి నాలుగు నెలల కాలంలో 1,600 కేసులు నమోదు చేయడం జరిగింది.*
*గుట్కా, గంజాలు మూడు నెలల కాల వ్యవధిలో 8,320 కేజీలు సీజ్ చేయడం జరిగింది.*
*ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకున్నా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లా యస్.పి….*
తిరుపతి నగరంలో సంచలనము రేపిన ఒక హత్య కేసులో ప్రముఖ పాత్ర పోషించిన ఒక రౌడీ షీటర్ ను హత్య చేయుటకు కుట్ర పన్నిన రౌడీ ముఠా అరెస్ట్ వివరాలను తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు ఈ రోజు సాయంత్రం యస్.పి ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను తెలిపారు.
*కేసు వివరాలు:*
తిరుపతిబన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి అడిషనల్ యస్.పి క్రైం శ్రీ మునిరామయ్య గారి పర్యవేక్షణలో మరియు సి.సి.యస్ డి.యస్.పి శ్రీ మురళీధర్ గారి ఆధ్వర్యములో రౌడీ షీటర్స్ మరియు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడమైనది.
అందులో బాగముగా 2017 వ సంవత్సరము, డిసెంబరు నెలలో పరశాలవీధి నందు సాకే భార్గవ్ అను అతనిని బెల్ట్ మురళి మరియు అతని అనుచరులు కొంత మంది కలసి హత్య చేసినారు. సదరు హత్యకు ప్రతీకారముగా 2019 వ సంవత్సరము నందు బెల్ట్ మురళిని భార్గవ్ కు సంబందించిన బంధువు మరియు అనుచరులైన, దేసన్నగారి నరసింహ, దాసరి మలికార్జున మరి కొంత మంది కలసి SK ఫాస్ట్ ఫుడ్ వద్ద హత్య చేసినారు. సదరు హత్యకు ప్రతీకారముగా 2020 వ సంవత్సరము సెప్టంబరు నెలలో బెల్ట్ మురళి హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించిన గిరిపురం కు చెందిన దినేష్ అను అతనిని అలిపిరి రోడ్డు SBI ATM ఎదురుగా బెల్టు మురళి అన్న కొదువు అయన పసుపులేటి వినయ్ అతని అనుచరులు కలసి కత్తులతో పొడిచి హత్య చేసినారు. ఈ పరంపరలో భార్గవ్ హత్య కేసులో ముద్దాయి అయిన ఒక రౌడీ షీటర్ ని భార్గవ్ దగ్గర బంధువు అయిన సాకే దినేష్ అను అతను తన అనుచరులు గాయం గణేష్, అత్తూరు గణేష్ మరియు ఒక బాల నేరస్థుడుతో కలసి హత్య చేయుటకు కుట్ర పన్నినట్లు అందులకు అవసరమైన కత్తులును సమకూర్చుకుని ఈ దినం సదరు ప్రణాళిక అమలు గురించి రామచంద్ర పుష్కరిణి ఎదురుగా గల దోభీ ఘాట్ వద్ద నలుగురు మాట్లాడుకునుచుండగా సి.సి.యస్ డి.యస్.పి మురళీధర్, వెస్ట్ సి.ఐ శివ ప్రసాద్ వారి ఖచ్చితమైన సమాచారము మేరకు పై ముగ్గురు ముద్దాయిలు మరియు బాల నేరస్థుడిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కత్తులు/మారణాయుధాలు స్వాధీనము చేసుకోవడమైనది.
విచారణలో వీరు సదరు ప్రణాళిక అమలు కొరకు కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చుకొనుట కొరకు తిరుపతి టౌన్, రామచంద్రాపురం మరియు రైల్వే కోడూరు నందు దొంగలించిన 8 మోటారు సైకిళ్ళు, రాత్రులందు షాపులు పగలకొట్టి దొంగలించిన ల్యాప్ టాప్ ను మరియు వారి వద్ద ఉండిన 1200 గ్రాముల గంజాయిని, మత్తును కలిగించే నైట్రోవిట్ టాబ్లెట్స్, హ్యాండ్ గ్లౌజు స్వాధీనము చేసుకుని ఈ విషయముగా తిరుపతి, పడమర పి.యస్. నందు Cr.No.247/2021, U/Sec.115, 120(b), 144, 506 IPC. Sec.25(1)(A) of Arms Act-1959, Sec.20(b), (ii) of NDPS Act 1985 కేసు నమోదు చేయడమైనది.
*పై కేసులో ముద్దాయిలు:*-
1) సాకే దినేష్ వయసు 19 సం. తండ్రి పేరు దేవేంద్ర . IS మహల్ దగ్గర, బొమ్మగుంట తిరుపతి (12 పాత కేసులు)
2) గాయం గణేశ్ , వయసు 22 సం.లు s/oలేట్ జి సుబ్బ రెడ్డి ,కోలా వీధి, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఎదురుగా తిరుపతి. (03 పాత కేసులు)
3) అత్తూరు గణేష్, @ గని, వయసు 25 సం. తండ్రి పేరు మురళి, తారక రామ నగర్, కరకంబాడి రోడ్, తిరుపతి. (02 పాత కేసులు)
4) చట్టముతో వేభేదించిన బాల నేరస్తుడు. (04 పాత కేసులు)
వీరిపై తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్, తిరుచానూర్, ఈస్ట్ పి.యస్, వెస్ట్ పి.యస్ మరియు చుట్టుపక్కల దొంగతనము కేసులలో జైలు లో ఉండి గత నెలలో జైలు నుండి బయటకు వచ్చి పై నేరములు చేసినట్లు చెప్పినారు. పై నేరస్తులను అరెస్టు చేయడంలోను, పై హత్య కుట్రను భగ్నం చేయడంలో మరియు చోరీ సొత్తులు రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన తిరుపతి, సి.సి.యస్ డి.యస్.పి శ్రీ మురళీధర్, వెస్ట్ సి.ఐ శివ ప్రసాద్, క్రైమ్ సి.ఐ లు రసూల్ సాహెబ్, చిరంజీవి రావు, మోహన్, యస్.ఐ లు చలపతి, నరసింహ లను, సిబ్బంది హెచ్.సి.లు గోపికృష్ణ, వెంకట్రావు, మురళి, పి.సి.లు గోపినాద్, ప్రసాదు, బారుష, మోహన్, రవి, రామకృష్ణ, రమేష్, స్వయం ప్రకష్ లను జిల్లా యస్.పి గారు అభినందించారు.