రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష ఐఏఎస్

తిరుపతి  నగర పరిధిలోని ఇరుకు రోడ్లను  విస్తరణ  పనుల్లో భాగంగా ముందస్తుగా నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష పి ఎస్ ఐఏఎస్, ఉప మేయర్ ముద్ర నారాయణ లు కలిసి  పరిశీలించారు. 

బుధవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూర్చున్న గాంధీ విగ్రహాన్ని  కొత్తగా ఏర్పాటు చేయనుండటంతో  ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం గ్రూప్ థియేటర్ నుండి పోస్ట్ ఆఫీస్ వీధి మీదుగా గంగమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ పనులను ముందస్తుగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా మైదానంలో నిర్వహించబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ నాయకులు తులసి యాదవ్, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, ఎం ఈ చంద్రశేఖర్, డీ సి పి మోహన్ కుమార్, ఏ సి పి షణ్ముగం, ఎస్ ఎస్ 1 సుమతి, సర్వేయర్లు దేవానంద్, మురళి, మాజీ కౌన్సిలర్ శంకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

About The Author