లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం?
TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు.
ఈ నెల 24న రాజోలు నుంచి తిరిగి ప్రారంభించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు సాగాల్సి ఉండగా.. విశాఖలోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు.
ఇదే సెంటిమెంట్తో లోకేశ్ కూడా అక్కడే ముగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.