అదిరిపోయిన వెడ్డింగ్ కార్డు…అంబానీ ఇంట పెళ్లి బాజా..
https://www.instagram.com/p/Bt01qdgj6fy/
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ-నీతా అంబానీ కుమార్తె ఈషాకు పిరమల్ ఆనంద్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కార్పోరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జరిపించారు అంబానీ. కూతురు పెళ్లినే అంత వైభవంగా చేసిన అంబానీ.. ఇప్పుడు కొడుకు వివాహాన్ని ఎంత ఘనంగా చేస్తాడో చెప్పక్కర్లేదు. అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ పెళ్లి, ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మోహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చిన 9న జరగనుంది. ఆకాశ్, శ్లోకాల మొదటి శుభలేఖను ముంబైలోని సిద్దివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అంబానీ.. ప్రముఖులకు అందజేస్తున్నారు.వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉటుందో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంబానీల రేంజ్‌కు తగినట్లే ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ప్రముఖ డిజైనర్ల చేత గ్రాండ్‌గా తయారు చేసిన ఈ వెడ్డింగ్ కార్డులో ముఖేశ్-నీతా అంబానీలు స్వహస్తాలతో రాసిన లేఖ మొదట దర్శనిమిస్తుంది. ఆ తర్వాత సంగీత్, మెహంది, పెళ్లి వేదిక, అతిథులకు ఇచ్చే బహుమతులు వివరాలు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు వెడ్డింగ్ కార్డు తెరవగానే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటాయి. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.