గోరక్షణ

“గవామంగేషు తిష్ఠన్తి భువనాని చతుర్దశ” అని పురాణాలు అంటున్నాయి.

గోవుల శరీరంలో ప్రతీ అంగమూ దేవతామయమే. చతుర్దశ భువనాలూ గోమాతలో నిక్షిప్తమైనట్లే అని శ్రుతి స్మృతులు ఘోషిస్తున్నాయి. హిందువులకు అనాదిగా శ్రుతి స్మృతులే ప్రామాణికాలు కాబట్టి, అవి చెప్పినట్లే గోవును పూజిస్తూ వస్తున్నారు. షుమారుగా దేశ జనాభాలో 80శాతం మంది గోవును పూజించేవారే. పూర్వకాలంలో సంపన్నులను కూడా గోసంపదను బట్టి పరిగణించేవారు. గోవు వైపు కోపంగా చూస్తేనే దోషంగా భారతీయ వాఙ్మయం పేర్కొంటోంది. గోవు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతోనే నారాయణుడు కూడా కృష్ణునిగా గోకులంలో జన్మించాడు.

పరాశరస్మృతిలో గోవు గిరంచి 3 అధ్యాయాల్లో విస్తారంగా వివరించారు. ధర్మశాస్త్రాల్ని ఎంతో సూక్షంగా చెప్పే ఋషులు గోవు గురించి మాత్రం ఇంత విస్తారంగా చెప్పడంలోనే మనకు గోవు గొప్పదనం అర్థమవుతోంది.

పరాశరస్మృతిలో చెప్పిన గోరక్షణ నియమాల్లో కొన్ని హైలెట్స్

1) ఇళ్ళలో పేర్చుకున్న ధాన్యాది పదార్థాల్ని ఎవరి గోవైనా వచ్చి భక్షించుచున్నచో, చూసినా కూడా వాటి యజమానులకు చెప్పరాదు.

2) కాలం కాని కాలంలో దూడ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా వారించకూడదు.

3) తాను పోషించుచున్న ఆవు నీరు తాగిన తరువాతనే తాను తాగవలెను. ఆవు తిన్న తరువాతనే తాను తినవలెను.

4) ఎక్కడైనా బలహీనతతో ఆవు కింద పడిపోయిన తాను లేపవలెను. ఊబిలో కూరుకుపోయినచో తన ప్రాణమునైననూ లెక్క చేయక గోవును రక్షింపవలెను.

5) గోరక్షణలో భాగంగా గోపాలకుడు ప్రాణాలు కోల్పోయినట్లైతే, బ్రహ్మహత్యా పాతకాది దోషాలతో సహా అన్ని పాపములూ పోవును.

6)ఆవును ఎట్టి పరిస్థితులలోనూ కర్రతో కొట్టరాదని తెలిపారు.

ఇంత పవిత్రంగా మనం పూజించుకునే గోవును ఎవరైనా వధిస్తే వ్యతిరేకించడం నేరమేమీ కాదు. గోవును తినడం మా హక్కని కొన్ని వర్గాలు గొంతు చించుకుంటున్నాయి. కుహనా లౌకికవాదులు కూడా గోవధకు అనుకూలంగానే గొంతు విప్పుతున్నారు. నిజానికి గోవధ గురించి భారత రాజ్యాంగం ఏమి చెప్తోంది? అని మనం చూసినట్లైతే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం గోవధను నిషేధించమని స్పష్టమైన ఆదేశాలనిచ్చింది. మరి గోవధను సమర్థించే వారంతా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా! అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది.

ఎందుకంటే రాజ్యాంగంలోని 48వ అధికరణం ఈ విధంగా చెప్తోంది.

“వ్యవసాయ రంగాన్ని పాడి పరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రత్యేకించి మేలైన పశుసంపదను పరిరక్షించి అబివృద్ధి చేయాలి. ఆవులు మొదలైన పాలిచ్చే జంతువుల వధను నిషేధించాలి”

అని రాజ్యాంగం సూచించింది. మరి రాజ్యాంగాన్ని తూచ చప్పకుండా పాటించేస్తున్నట్లు చెప్పుకునే స్వయం ప్రకటిత మేధావులకు ఈ విషయం తెలియదని అనుకోవనక్కర లేదు. వారికి తెలిసే కొన్ని విదేశీయుల మెప్పు కోసం, ఇతర లాభాల కోసం వీరంతా పని చేస్తున్నారు.

కాబట్టి గోవధను నిషేధించమని మనం కోరడం ఎంత శ్రుతిసమ్మతమో అంతే రాజ్యాంగసమ్మతం కూడా….

జై గోమాత……..

About The Author