తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ కార్యాలయములో సమావేశం…

తేది: 07.03.2019 రోజున ఎర్రమంజిల్ లోని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ కార్యాలయము నందు పంచాయతీ రాజ్ సంస్థలకు 2014-15 నుండి 2017-18 సంవత్సరములకు గాను రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన నిధులు, పన్నుల ఆదాయ వివరాల పై సెస్స్ (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్) అధ్యయనం చేసి సమర్పించిన డ్రాఫ్ట్ రిపోర్ట్ మీద చర్చించడం జరిగినది .
ఈ సమావేశమునందు తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆర్థిక కమీషన్, చైర్మన్ శ్రీ జి.రాజేశం గౌడ్ గారు, కమీషన్ సభ్యులు శ్రీ యం.చెన్నయ్య గారు, కమీషన్ మెంబర్ సెక్రెటరీ శ్రీ.సురేష్ చందా, I.A.S., ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ రామకృష్ణ రావు, I.A.S., గారు ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శ్రీ వికాస్ రాజ్, I.A.S., గారు, కమీషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శ్రీమతి నీతూకుమారి ప్రసాద్, I.A.S., గారు మరియు శ్రీ గోపినాథ్ రెడ్డి, సెస్స్ (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్) ప్రతినిధులు పాల్గొన్నారు.
సెస్స్ (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్) అధ్యయన డ్రాఫ్ట్ రిపోర్ట్ ను సమావేశము నందు చర్చకు ప్రవేశ పెట్టినారు. వారు అధ్యయనం చేసినరాష్ట్రంలోని (5) జిల్లాలు అనగా 1.ఆదిలాబాద్ 2. కరీంనగర్ 3.వరంగల్ 4.నల్గొండ 5.రంగారెడ్డి జిల్లాలోని 10 మండలములు మరియు 20 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని వాటి యొక్క ఆర్థిక స్థితి గతులపై విశ్లేషించిన అంశాలను సమావేశంనందు వివరించినారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులు కనీస అవసరం మేరకు విడుదల చేసినప్పటికీ స్థానిక సంస్థల స్వంత వనరుల ఆదాయం తక్కువ వున్నట్లు అధ్యయనములో తెలిపినందున స్వంత వనరుల ద్వార సమకుర్చుకొనే ఆదాయములో గ్రామ పంచాయతీలు వారి పరిధిలో గల వృత్తిపన్ను, ఇంటిపన్ను, సంతలు మొదలగు అవకాశములను బట్టి మేరుగుపరచుకొన వలసియున్నది.
వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మరియు సాగునీటి పారుదల శాఖలు నేరుగా కాకుండా పంచాయతీ రాజ్ సంస్థల అధీనంలో మరియు ప్రత్యక్ష పర్యవేక్షణ పనిచేయాల్సిన అవసరం వుంది.
గత 30 సంవత్సరమల క్రింద నిర్ణయించిన ఫార్ములా ప్రకారం (పర్ క్యా పిటా) తలసరి గ్రాంటు నిధులు పంచాయతీ రాజ్ సంస్థలకు అర్థిక సంవత్సరములలో 4 క్వార్టర్ లు పూర్తిగా విడుదల కావటం లేదు. (పర్ క్యా పిటా) తలసరి గ్రాంటు నిధుల కేటాయింపు పెరిగిన జనాభా ప్రకారం పెంచవలసిన అవసరం వుంది.
గ్రామ పంచాయతీల కు ఒకే కార్యదర్శి 3-4 గ్రామ పంచాయితీలకు వుండడం వలన గత 4 సంవత్సరములలో ఆశించినంత వరకు పన్నుల వసూలు కానీ ఇతర పనుల ప్రగతిని సాధించడం లో ఇబ్బందులు ఎదుర్కొనడం గమనించనైనది.
జిల్లా మినరల్ ఫండ్ (DMF) పంచాయతీ రాజ్ సంస్థల అధీనంలో మరియు ప్రత్యక్ష పర్యవేక్షణ పనిచేయాల్సిన అవసరం వుంది. పంచాయతీ రాజ్ సంస్థల స్టాండింగ్ కమిటిల సిఫార్సులను సర్వ సభ్య సమావేశంలో చర్చించి సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం వుంది. సమాంతర శాఖలు (లైన్ డిపార్ట్మెంట్) లపై పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల అజమాయిషీ కొరవడడం జరుగు తున్నది.
పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలలో సరిపోయే అధికార గణం అందుబాటులో లేకపోవడం ముఖ్యమైన పోస్టులలో తాత్కాలికం గా అధికారులను ఇతర శాఖల నుండి తీసుకోవడం వలన ఆశించిన అభివృది రావడం లేదని సెస్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు అధికార వికేంద్రికరణలో తెలంగాణ రాష్ట్రం ఇంకను ముందంజ వేయవలసి వుందని విశ్లేశించనైనది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించుటకు నూతన పంచాయతీ రాజ్ చట్టం,2018 ను ప్రవేశపెట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆర్థిక కమీషన్, చైర్మన్ శ్రీ జి.రాజేశం గౌడ్ గారు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ మధ్యంతర నివేదికలో తెలిపిన నిధుల కన్నా పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులను అనగా “కేంద్ర ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.లు.1629 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.లు.1029 కోట్లు కేటాయించగా, NREGP ద్వార రూ.లు.4000 కోట్లు మరియు స్థానిక పన్నుల ద్వార మరో రూ.లు.700 కోట్ల నిధులు సమకూరగా రెట్టింపు నిధులతో రూ.లు.8000 కోట్ల నిధులు” కేటాయిస్తున్నట్లు 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగములో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు ప్రకటన చేయడం అభినందించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి.రాజేశం గౌడ్ గారు సంతోషం వ్యక్తం చేసినారు.

About The Author