దేశమంతా మారు మ్రోగుతున్న పేరు తేజశ్వీసూర్య


ఇప్పుడు దేశమంతా
మారు మ్రోగుతున్న పేరు తేజశ్వీసూర్య (28)
అసలు ఎవరీ తేజశ్వీ సూర్య., ఆయన గొప్పతనమేంది..??

25-03-2019 సోమవారం ఉదయం 9.00 గంటలకు బెంగుళూరుకు చెందిన ఓ 28 ఏళ్ళ యువ లాయర్ వారాంతం శెలవు అనంతరం పొట్టకూటి కోసం తన దైనందిన కోర్టు విధులకు బయలుదేరబోతున్నారు..

ఇంతలో #ఢిల్లీ నుండి అతని సెల్‌కు ఫోన్ చేసిన వ్యక్తి మీ పేరు తేజశ్వీసూర్య కదూ, కన్ఫర్మ్ చేయగలరు అంటూ మాట్లాడారు..
ఇవతలివైపు నుంచి “అవును ఎవరు కావాలి మీకు..?? నేను సూర్యనే మాట్లాడుతున్నాను..” అన్నాడు
“ఒక్క నిమిషం, మీతో ప్రధాని #మోడీజీ మాట్లాడుతారు..” అంటూ అవతలి వ్యక్తి లైన్ హోల్డులో పెట్టారు..
ఓ 10 సెకనుల తరువాత “ప్రియ మిత్రడు తేజశ్వీ గారికి శుభాకాంక్షలు, మీరు పార్టీకి చేసిన సేవలను, మీ అకుంఠిత దీక్షను పార్టీ గుర్తించి, మీకు #బెంగుళూరు_సౌత్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించాం, మీరు భారతదేశ #చరిత్రలో అతి తక్కువ వయస్సులో పార్లమెంటులో అడుగుపెడుతున్న ఎంపీగా రికార్డు నెలకొల్పబోతున్నారు, శుభాశీస్సులు, మిగతా వివరాలు పార్టీ మీకు తెలియజేస్తుంది..” అంటూ ప్రధాని మోడీజీ మాట్లాడారు..

అస్సలు ఊహించని ఈ పరిణామానికి తేజశ్వీ సూర్యకు ఏమి చేయాలో అర్థం కాలేదు., కాళ్ళూ చేతులూ వణకసాగాయి., నేను విన్నది నిజమా లేక కలా అని ఓ 15 నిమిషాలు తేరుకోలేక పోయాడు., కారణం తను ఓ సాధారణ మధ్యతరగతికి చెందిన భాజపా కార్యకర్త..
పొట్టకూటి కోసం లాయర్ వ్రృత్తి చేసుకుని జీవిస్తున్నాడు..
కనీసం ఒక కార్పోరేటర్‌గా కూడా పోటీచేయుటకు ఊహించడానికి అవకాశంలేని ఆర్థిక నేపధ్యం..
అటువంటిది ఒక ఎంపీగా పోటీ చేయమని, నేరుగా ప్రధాని ఫోన్ చేసి చెప్పడం..

#Bangalore_South లోక్‌సభ స్థానం ప్రత్యేకత:
******************************************
1977 నుంచి ఇంతవరకు 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్క1989లో తప్ప మిగతా అన్ని సార్లూ అక్కడ భాజపానే గెలిచింది..
పోయిన నవంబరులో మ్రృతి చెందిన కేంద్ర మంత్రి #అనంతకుమార్ అక్కడ వరుసగా 5 సార్లు ఎన్నికయ్యారు..
ఈసారి అక్కడ నుండి మోడీజీ బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది..
మోడీజీ బరిలోకి దిగితే ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కలలుగన్నవారిలో ఈ తేజశ్వీ సూర్య కూడా ఒకరు..
అటువంటిది మోడీగారే ఆయనకు ఫోన్ చేసి “మీకు సీటు కేటాయిస్తున్నాం..” అని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు….!!

#బెంగుళూరుసౌత్ అంటే ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ కంపెనీలూ, బడా రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ కేంద్ర స్థానం..
కర్ణాటకలోనే అత్యధికంగా 95% అక్షరాస్యత కలిగిన ప్రాంతం..
అంతా చదువుకున్న జ్ఞానవంతులు ఉండడంతో అక్కడ భాజపా తిరుగులేని మెజారిటీతో గెలిచే స్థానం..
సాధారణంగా మరేఇతర పార్టీ అయినా అటువంటి స్థానాన్ని బడా ఇండస్ట్రియలిస్టులకు కేటాయించి, వారి నుంచి ఎంతలేదన్నా ఓ 200-300 కోట్లు పార్టీ ఫండు కింద నొక్కేస్తారు..
అటువంటిది #మోడీజీ_అమిత్షాలు ఎంత మహోన్నతంగా యువతకు ప్రాధాన్యతనిచ్చారో గమనించాలి….!!

About The Author