తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ ధృవీకరణ అథారిటి 9వ సాధారణ పాలక మండలి సమావేశం…

తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ ధృవీకరణ అథారిటి 9వ సాధారణ పాలక మండలి సమావేశం శ్రీ సి.పార్థ సారథి, వ్యవసాయ & సహకార శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన హకా భవన్లోని సంస్థ సమావేశ మందిరంలో జరిగింది.మూడు నెలలకొకసారి జరిగే ఈ సమావేశంలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ కె. ధర్మయ్య పాటు, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ వెంకట్రామ్ రెడ్డి, విత్తన పరిశోధన & సాంకేతికత కేంద్రం డైరెక్టర్, డాII నగేష్, వ్యవసాయ శాఖ ప్రతినిధిగా శ్రీ శివానంద్, ప్రివేటు విత్తన ఉత్పత్తిదారుల ప్రతినిధులు రమణ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.సంస్థ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, ధృవీకరణ విత్తన నాణ్యత ప్రమాణాలు పెరిగాయని, ఆన్ లైన్ సేవలు అద్భుతంగా ఉన్నాయని పాలకమండలి ప్రశంశించింది. ఈ రబీ కాలంలో విత్తనోత్పత్తిని గణనీయంగా పెంచాలని, రాజేంద్రనగర్ లో నిర్మాణంలో ఉన్న ISTA ల్యాబ్ కు అత్యాధునిక పరికరాలను ఆమోదిస్తూ, సహా వచ్చే నెల పూర్తి చేయాలని ఆదేశించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరీక్ష కొరకై నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలన్నారు. రాజేంద్రనగర్ మరియు కరీంనగర్ లో గల రెండు విత్తన పరీక్షా కేంద్రాలలో సౌర విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు అంగీకరించింది. సంస్థకు సంబందించి 2017-18 ఆడిట్ రిపోర్ట్ ను ఆమోదించింది.

About The Author