కోనాయిపల్లి వెంకన్నను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు

తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్నను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు దర్శించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు కేసీఆర్‌ గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోయినాపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌.. నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు. స్థానిక తెరాస అభ్యర్థి హరీశ్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

About The Author