పార్లమెంట్ ఎన్నికల కోసం ‘నా ఓటు’ app…

గత డిసెంబరులో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలకోసం ఎన్నికల ప్రధాన అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతంగా ప్రవేశపెట్టిన ‘నా ఓటు’ అనే మరో అధునాతన, బహుళ ప్రయోజనకర యాప్‌కు – పార్లమెంట్ ఎన్నికల కోసం మరిన్ని మార్పులు చేసి ఓటర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియ చేసింది. ఇప్పడు ఇది హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పనిచేస్తున్నది.
ఆండ్రాయిడ్, ఐఓస్ అనే రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ల మీద పనిచేసే ఈ యాప్ ద్వారా ఓటరుకు కలిగే ప్రయోజనాలు-
• ఓటరు తన ఎపిక్ నంబరును, పేరును, నియోజకవర్గాన్ని క్షణాల్లో వెతికి పట్టుకోవడం,
• నియోజకవర్గంవారీగా, జిల్లావారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా, బూత్‌లవారీగా అధికారుల వివరాలు తెలుసుకోగలగడం,
• నియోజకవర్గాలవారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోగలగడం
• ఎపిక్ నంబరు లేదా ఓటరు పేరుసాయంతో పోలింగ్ స్టేషన్, పోలీస్ స్టేషన్‌లు తెలసుకోవడం, వాటి దగ్గరకు వెళ్ళడానికి దగ్గర దోవ, అక్కడికి చేరుకోవడానికి వీలయిన బస్టాస్, రైల్వే స్టేషన్ ఎక్కడున్నాయో , అలాగే టాక్సీ, మెట్రో సమాచారం తెలుసుకోగలగడం,
• అన్నిటికీ మించి తన నియోజక వర్గం వివరాలు, అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నదీ తెలుసుకోవడం.
• ఇక దివ్యాంగ ఓటర్లకయితే పోలింగ్ బూత్‌కు వెళ్ళిరావడానికి రవాణా సౌకర్యం కల్పించమని విన్నవించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.
• ఆన్‌లైన్ ద్వారా ఓటరు పేరు నమోదు వివరాలు తెలుసుకోగలగడం.
గత శాసనసభ ఎన్నికల సమయంలో దీనిని 2.6 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు దాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చని లేదా తాజాగా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటన తెలియచేసింది

About The Author