ఓటు వజ్రాయుధం లాంటిదని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందం తమ ప్రదర్శన ద్వారా పిలుపునిచ్చింది. ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం వనపర్తిలోని 95 ,96 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలకు ఓటు దాని విలువ పై, కళాజాత ప్రదర్శనల ద్వారా వివరించి చెప్పారు. ముఖ్యంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేయాలని, డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే పోలింగ్లో ప్రతి ఓటరు పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About The Author