అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ?

డిసెంబర్ 7న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కు అవసరమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్వేతా మహంతి ఆదేశించారు.కెమరా ఉన్న ల్యాప్ టాప్ కలిగి ఉండి బీ.టెక్, బీఎస్సీ కంప్యూటర్స్, బి సి ఏ, బీకాం కంప్యూటర్స్, ఎంసీఏ అర్హత కలిగిన వారు కలెక్టర్ కార్యాలయం లోని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను సంప్రదించాలని లేదా http://wanaparthy.telangana.gov.in/elections/ ద్వారా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఇందుకుగాను ఒక్కొక్క అభ్యర్థికి 600 రూపాయలతో పాటు రవాణా సౌకర్యం, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

About The Author