కానిస్టేబుల్‌ అర్చనా జయంత్‌ అంకితభావానికి ఇది నిదర్శనం.

వెచ్చగా మంచంపై నిద్రించాల్సిన ఈ పాపాయి ఇలా రిసెప్షన్‌ డెస్క్‌పై ఉందేమిటని విస్తుపోతున్నారా? పని పట్ల మహిళా కానిస్టేబుల్‌ అర్చనా జయంత్‌ అంకితభావానికి ఇది నిదర్శనం.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆమె పనిచేస్తోంది.

తన ఆరునెలల పాప బాధ్యతలు చూసే వారు లేకపోవడంతో ఇలా స్టేషన్‌కు తీసుకొచ్చి తన విధులను నిర్వరిస్తోంది.

తల్లి బాధ్యతలు, ఉద్యోగం బాధ్యతలను ఏకకాలంలో నిర్వహిస్తున్న అర్చనకు ఇదే నా శాల్యూట్‌.. అంటూ యూపీ సీనియర్‌ పోలీసు అధికారి రాహుల్‌ శ్రీవాస్తవ ట్వీట్‌ చేశారు. సోషల్‌మీడియాలో ఈ ఫోటో వైరల్‌ అయింది.

About The Author