చంపేశారు.. గుండె తీసుకెళ్లారు..? కర్నూలు లో దారుణ హత్య…

చంపేశారు.. గుండె తీసుకెళ్లారు..
కర్నూలు లో దారుణ హత్య…

మనిషిని చంపేసి తల తీసుకెళ్లడం , మొండెం మాయం చేయడం , కాళ్ళు ,చేతులు నరికేసి పారేయడం … ఇప్పటివరకు ఇలాంటివే విన్నాం .. చంపేసిన వ్యక్తి గుండెను తీసుకెళ్లడం ఇదే మొదటిసారి.. అదీ కర్నూలు నగరంలో జరిగింది.. కర్నూలు లో పేరుమోసిన రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సాయిబాబాగిరికి చెందిన చెన్నయ్యను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి శరీరంలో గుండె లేకపోవడంతో అందరూ షాక్‌ గురయ్యారు. దుండగులు హత్య చేసిన అనంతరం మృతుడి గుండెను తీసుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

About The Author