పాము కాటు వైరల్ గా మారిన చావు వీడియో..

https://www.youtube.com/watch?v=5f3y2MuSzOU

వైరల్ గా మారిన చావు వీడియో..

పాముని మెడలో వేసుకుని ఫొటో తీసుకుందామన్న సరదా ఆ యువకుడు ప్రాణాలు బలి తీసుకుంది. పాముని మెడలో వేసుకుని స్నేహితుడిని ఫొటో తీయమని చెప్పిన ఆ యువకుడు కాసేపటికే పాము కాటుతో ప్రాణాలు వదిలాడు. ఈ చావు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సూళ్లూరుపేట సెంటర్లో రమేష్ అనే వ్యక్తి పామును ఆడిస్తూ అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటున్నాడు. అప్పుడే అక్కడికి మంగళంపాడుకు చెందిన చిట్టేటి జగదీష్(24) అనే వ్యక్తి వచ్చాడు. పాముతో సెల్ఫీ దిగేందుకు ఫోన్ తీసుకుని దాని దగ్గరకు వెళ్లాడు. అది బుసకొట్టే సరికి ఫోన్ బుట్టలో పడిపోయింది. ఇలా కాదనుకుని దాన్ని తన మెడలో వేయమని పాములు ఆడించే రమేష్ కి చెప్పాడు. డబ్బుకి ఆశపడి రమేష్ అతని మెడలో పాముని వేశాడు. అయితే అనుకోకుండా పాము జగదీష్ ని కాటేసింది. కాసేపటికి స్పృహ తప్పిన రమేష్ ఆస్పత్రికి తరలించేలోపే విష ప్రభావంతో చనిపోయాడు. పోలీసులు పాములు ఆడించే రమేష్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

About The Author