తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ?…KCR
తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని, దానికి తగినట్లు రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి? ఏది ఎంత తింటున్నారు? ఎంత పండిస్తున్నారు? ఎంత దిగుబడి చేసుకుంటున్నారు? ఎంత ఎగుమతి చేస్తున్నారు? తదితర అంశాల్లో ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఏమి పండించాలి? ఏమి పండించవద్దు? ఏ పంటల సాగును ప్రోత్సహించాలి? మొత్తంగా ఏది లాభదాయకం? ఏది ఉపయుక్తం? అనే విషయంలో నిర్ధిష్టమైన అభిప్రాయానికి రావాలని చెప్పారు. ఈ అంశాల్లో ఖచ్చితమైన వివరాలు రాబట్టేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పదిరోజుల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ ఖచ్చితమైన అంచనాలతోనే రాష్ట్రంలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులు పండించిన ప్రతీ గింజకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలని సిఎం నిర్దేశించారు. రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్ కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట మార్కెట్ వచ్చి, కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి రావాలన్నారు. మార్కెటింగ్ శాఖే కొనుగోళ్లు చేయడం వల్ల పోటీ తత్వం పెరుగుతంది. మంచిధర వస్తుంది. మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని సిఎం ఆదేశించారు. దేశ విదేశాల్లో మార్కెట్ పోటీదారులను గుర్తించి, వారిని ఎదుర్కొనే వ్యూహం రూపొందించాలన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి అవలంభించాల్సిన వ్యూహం రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సీనియర్ అధికారులు పార్థసారథి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, పౌసమి బసు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిభాయి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం చేసిన ఆలోచన ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారులను ఆదేశించింది. రైతులకు కనీస మద్దతు ధర లభించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా రైతులకు మంచి ధర లభించడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమగ్ర వ్యూహం రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పండ్ల తోటలున్నాయి. ఇతర పంటలను కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. కానీ ఈ పంటల సాగు శాస్త్రీయంగా లేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి పండించడం లేదు. ఉత్పాదకత పెరగాలి. నాణ్యత పెరగాలి. అప్పుడే రైతులకు మంచి ధర వస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. ఇంకా కఠినంగా ఉంటుంది. పత్తి దిగుబడి ఎక్కువ రావడం కోసం అనువైన భూముల్లోనే పత్తిసాగు చేయించాలి. మేలురకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాటిని అధ్యయనం చేసి అనుసరించాలి. పంజాబ్ సహా వరిసాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి. మెలుకువలు నేర్చుకుని, రైతులకు నేర్పించాలి. తక్కువ కాలరీలు, తక్కువ షుగర్ ఉన్న వరి వంగడాలు సాగుచేయాలి. వరిలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను తీర్చిదిద్దాలి. మక్కజొన్నకు మంచి డిమాండ్ ఉంది. మంచి విత్తనాలు తయారు చేయాలి. ప్రతీ రోజు వంటలో వాడే చింతపండుకు కొరత ఉంది. తెలంగాణలో విరివిగా చింతచెట్లు పెంచాలి. హరితహారం కింద కనీసం 5 కోట్ల మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. పసుపు కొమ్ములను పసుపు పొడిగా, మిరపకాయలను కారం పొడిగా, కందులను పప్పుగా మార్చి అమ్మే పనిని మహిళా సంఘాల ద్వారా చేయించాలి. స్వచ్చమైన పల్లినూనె, నువ్వుల నూనెలను తయారు చేయాలి. దీనివల్ల రైతులకు మంచిధర వస్తుంది. మహిళలకు ఉపాధి దొరకుతుంది. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుంది. మేలు రకమైన సాగు పద్ధతులను రైతులకు నేర్పడానికి వ్యవసాయ విస్తరణాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనింగ్ సెంటర్లను పెట్టాలి. యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలి.
తెలంగాణలోని ప్రజలు ఏ ఆహార పదార్ధాన్ని ఎంత తింటారో ఖచ్చితమైన అంచనా ఉంటే, ఏది పండించాలో నిర్ణయించవచ్చు. ఏ పంటకు మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని పంటల సాగు చేస్తే, మంచి ధర వస్తుంది. అందుకే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, ఒక్కో రైతు నుంచి వివరాలు తీసుకుని, ఏ గుంట భూమిలో ఏది సాగు చేస్తున్నారో వివరాలు సేకరించాలి? బియ్యం ఎంత తింటున్నారు? కూరగాయలు ఎన్ని తింటున్నారు? పప్పుదినుసులు ఎంత తింటున్నారు? మసాలా దినుసులు ఎంత తింటున్నారు? నూనె గింజల వాడకం ఎంత? తదితర విషయాలు సేకరించాలి. అన్ని ఖచ్చితమైన వివరాలు ఉంటే దానికి అనుగుణంగా పంటల సాగు చేయడానికి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. పండించిన పంటకు మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వమే పూనుకుని చర్యలు తీసుకోవాలి. రైతులు కూడా పండించిన పంటనంతా ఒకేసారి మార్కెట్ కు తీసుకురాకుండా, గ్రామాల వారీగా మార్కెట్ కు తీసుకువచ్చే పద్ధతిని అలవాటు చేయాలి. రైతు సమన్వయ సమితులను ఉపయోగించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
‘‘మనం ప్రతీ రోజు కూరల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీన, జిలకర వేసుకుంటాం. కానీ అవి మనం పండించము. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటాం. మామిడిపండ్లు, బత్తాయిలు, ఇతర పండ్లు తింటాం. వాటిని కూడా దిగుమతి చేసుకుంటాం. చివరికి కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలున్నాయి. నగర జనాభా 50 శాతానికి చేరుకుంటుంది. అక్కడ నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలను ఆ పట్టణాల చుట్టుపక్కలున్న గ్రామాల్లో పండిచవచ్చు. కానీ పండించడం లేదు. గతంలో గ్రామాల్లో పండించే కూరగాయలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్మేవారు. కానీ నేడు వేరే ప్రాంతాల నుంచి పట్టణాలకు దిగుమతి చేసుకుని, పట్టణాల నుంచి కూరగాయలను గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి పోవాలి. మనం తినే కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను మనమే పండించుకోవాలి. ఒక్క బస్తా బియ్యం బస్తా కూడా తెలంగాణకు దిగుమతి కావద్దు. మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవాలి. అంకాపూర్ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు మంచి ధర రాబట్టుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘‘మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యకరం? ఏది కాదు? అనే విషయంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచాలి. మంచి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలి. ఆకుకూరలు, పండ్ల వాడకాన్ని పెంచాలి. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్ధాలను ప్రోత్సహించాలి. కొన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఆయా పండ్ల సాగుకు ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలి’’ అని సిఎం చెప్పారు.
వ్యవసాయ శాఖకు ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలు అనుబంధంగా ఉండాలని, దీనికోసం అధికార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సిఎం సూచించారు.
Honourable Chief Minister Sri K Chandrashekhar Rao has instructed the officers concerned that keeping in view the future supply of irrigated water to 1 crore 25 lakh acres and developing the irrigation sector accordingly, resulting in increase of agriculture produce largely, a strategy should be evolved to provide Minimum Support Price to the farmers. The CM suggested that through close coordination of Agriculture, Horticulture, Marketing and Civil Supplies departments and by providing minimum support price to the farmer the departments should work to make agriculture profitable. CM also suggested that the department should identify National and International competitors in marketing of our agriculture products and work out a strategy to face the competition. CM also suggested that the government should become a vibrant purchaser of agriculture products and evolve a mechanism to see that the private persons also pay minimum support price to the farmer.
Towards this, said the CM, the department should analyse what are the food needs of Telangana People?, what they are eating?, what they are producing?, How much they are importing?, How much they are exporting? etc and prepare proper and exact statistical data. Through this it should be worked out as to what to be produced? What not to be produced? What crops are to be encouraged? Which is profitable? Which is useful? And the department should come to a clear-cut understanding on these issues. To obtain perfect statistical data on these issues, the CM instructed that the agriculture department by way of a survey to be conducted within next ten days at the field level, should collect a comprehensive information on this. Based on these definite estimates, said the CM that crop colonies are to be established in the state. The CM instructed that the government policy should be in such a way that every agriculture product produced by the farmer should invariably get minimum support price and even better price more than that. The CM made it clear that if necessary, the marketing department would directly purchase produce from the farmer and to mobilize funds for this the government will stand surety to the directorate of marketing. The CM said that within five minutes after the agriculture produce reaches the market and weighing procedure is completed the farmer should be able to get cheque towards the sale proceeds. He said that when marketing department starts purchasing the produce then not only the farmer gets a better price but also there would be competition among the purchasers. The marketing department should buy from the farmer and export to other states and countries. The CM instructed that care should be taken that no one should be allowed to purchase the produce form the farmer which would be less than the minimum support price.
Honourable Chief Minister held a high-level meeting at Pragathi Bhavan on the subject of evolving a strategy for provision of minimum support price to the farmer. Ministers Errabelli Dayakar Rao, Allola Indrakaran Reddy, Government Chief Advisor, Rajiv Sharma, Chief Secretary SK Joshi, MP Vinod Kumar, MLA Sandravenkata Veeraiah, Prinicpal Secretary for Agriculture Parthasarathy, Senior officers Rahul Bojja, Smita Sabarwal, Pausami Basu, Horticulture Commissioner Venkatrami Reddy, Marketing Director Laxmi Bhai, Agriculture University VC Praveen Rao and others participated in the meeting.
“In tune with the thought process of Telangana government, in the recent past, the government of India at the centre has instructed its officers to establish crop colonies in every state. The efforts of Telangana state government to provide minimum support price to the farmer has become a role model to the entire country. We should feel proud for this. Similarly, to provide even better to the farmer than the MSP the government should take all possible steps. Towards this a comprehensive and integrated strategy has to be evolved” said the CM.
“In Telangana state paddy, maize and cotton are produced largely. There are also large number of orchids. Some other crops are also grown here and there. However, these crops are not scientifically organized once. The agriculture produce is not in tune with market conditions and variations. Farmer gets better price if only the productivity and quality is improved. The government is taking strict measures to prevent sale of spurious seeds. Henceforth it will be stricter. The cotton crop should be grown only in soil that suits it so that the produce is better. Improved variety of cotton production should be studied nationally and internationally and to be followed. Officials should tour in the paddy grown areas including Punjab and educate the farmers in better production measures. Paddy which has less calories and less sugar content are to be preferred. The farmer should be educated to prefer growing of high yielding varieties of paddy. There is heavy demand for maize and hence better seeds are to be developed. The tamarind which we use everyday is in scarcity and hence tamarind tree growing should be encouraged. As a part of harithaharam at least 5 crore tamarind saplings are to be supplied to the farmer free of cost. The self-help women groups are to be entrusted with the responsibility of making turmeric powder, mirchi powder and tur dal. They should make pure ground nut oil, sesame oil. Due to this farmer gets better price and women get employment. The consumer will be got rid of the problem of buying spurious items. For improved agriculture methods to the farmers the agriculture extension officers are to be converted as agronomists. In every Assembly constituency there shall be one agronomy training centre and in universities there need to be an agronomy consultancy” said the CM
“If only there is a clear-cut estimate as to what type of food the Telangana people consume, then it can be decided as to what crop may be grown. It is also better if crops are decided and chosen after knowing the better market facility to a particular crop so that better price could be obtained. That is why the agriculture department officers and staff should visit at the field level and obtain details from each and every farmer with regards to what crop they are growing in their fields. How much paddy is consumed? What quantum of vegetables are consumed? How much dal is consumed? How much spices are consumed? What is the usage of oil seeds?……On these details are to be obtained. If all these details are obtained perfectly, they it becomes possible to establish crop colonies easily. The government by itself should initiate measures to see that the farmer gets better market price to its crop. The farmers should also be advised not to bring the entire crop at a time to the market but should bring phase wise. For this the help of Rythu Samanvaya samithis should be taken” said the CM.
“Every day we consume leafy vegetables like coriander, methi, mint leaves and jeera in our curries. However, none of these are grown in our state but import them from various places. We also like to eat mangoes and sweet oranges which also we import from other places. We even import vegetables from other states unfortunately. We should overcome this. In our state there are 142 municipalities and the urban population is nearly 50% of the total population. The vegetable requirement of urban population could be met if they are grown in villages around the towns. This we are not doing. There were days when the vegetables grown in villages were taken to towns and sold there. But these days villages are importing vegetables from towns which are getting these from other states. This situation needs to be changed. The vegetables, the fruits, the other food items etc which we consume should necessarily grown by us only. Even a single quintal of rice should not be imported from other states. We should be in position to export rice to other places. Lessons to be learnt from Ankapur where the farmers grow crops only after finding out the market position to their crop both within the state and outside the state” suggested the CM.
“The government should also create an understanding to the people with regards to the better food habits, which is healthy or not healthy. We should encourage consumption of healthy food products. Usage of leafy curries and fruits should be encouraged. Doctors are of the opinion that the “Telangana Sonalu Rice” is better in regulating and preventing diabetics. Such food products are also to be encouraged. We are also importing certain fruits not only from other states but also from other countries. It is better if we ourselves identify suitable land to grown them and produce them” said CM.
The CM suggested that the horticulture department, marketing department, civil supplies and other connected wings should form part of agriculture department and towards this the official machinery should be revamped