సలేశ్వరం ! సాహస యాత్ర…సలేశ్వరం జాతర….

ఏప్రిల్లో లో శ్రీ రామ నవమి తర్వాత పౌర్ణమి రోజున మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ స్వామివారిని చూడడానికి సిద్ధంగా ఉండండి.

ఈసంవత్సరం ” ఏప్రిల్-17 నుండి 21-04-2019″వరకు.

భక్తులకు గమనిక:
పౌర్ణమి కి రెండు రోజులు ముందు పౌర్ణమి తర్వాత రెండు రోజులు , మొత్తంగా 5 రోజులు జాతర కొనసాగును.

నింగి నుంచి నేలకు దిగుతున్న ఆకాశ గంగను తలపించేలా మహత్తర జలపామది.ఈ ప్రకృతి రమణీయ ప్రదేశం ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడి ప్రస్తుతం సలేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది.
శైలమంటే కోండ,కోండలో ఈశ్వరుడున్న ప్రదేశం కావటంతో శైలేశ్వరం అనే పేరుతో కూడా పిలుస్తారు.
నల్లమల్ల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగనున్నది.దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు,గుట్టల మధ్య కొలువైన సలేశ్వర క్షేత్ర బ్రహ్మోత్సవాలు చైత్ర పౌర్ణమి రోజున ఘనంగా ఆరంభమయ్యాయి. వేలాది మంది భక్తులు ఉత్సహలకు రెండు రోజుల ముందు నుంచే వేయి అడుగుల లోతున ఉన్న లోయలోని సలేశ్వరం లింగమయ్యను దర్శనం చేసుకుంటూన్నారు.నిటారు కొండలు,పచ్చని చెట్లు, రాళ్లు రప్పల మధ్య గంటల తరబడి నడుస్తూ దర్శనానికి ‘వస్తున్నాం లింమయ్య’ అని, తిరిగి వెళ్లేటప్పుడు ‘పోయోస్తాం లింగమయ్య’ అంటూ భక్తుల నినాదాలతో కారడవిలో “శ్రీ రామలింగేశ్వర స్వామి” నామస్మరణతో మారుమోగుతుంది.లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉండటంతో వచ్చిపోయే వారు ఒకరిని ఒకరు పట్టుకుని లోయలోకి దిగాలి.చైత్ర పౌర్ణమి అర్థరాత్రి లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శంచుకున్నారు.సలేశ్వరం లోయలో వేయి అడుగుల ఎత్తు నుంచి గలగల పారే జలపాతం దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటోంది.పైనుండి చల్లని నీరు ద్వారగా వస్తుంది. ఇది జనం పెరిగే కొద్దీ నీటిద్వార పెరుగుతుంది.ఈ జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని,ఆయుష్షు పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఆలయ చరిత్ర:

నాగార్జునకొండ లో బయటపడిన ఇక్ష్వాకుల ఆధారాలను బట్టి…. లింగమయ్య గుడిలో గోడలు16/10/3
ఇక్ష్వాకుల నిర్మాణాలకు అదనంగా కుందేనోలు క్రీస్తు శకము 360, 3, 70 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి…. వీటి ఇటికల పరిమాణం 10/10/ 3 గా ఉన్నాయి….
గర్భగుడి ముఖద్వారం పైన విష్ణుకుండినుల శిలాఫలకం ఉన్నది…..
ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రడు,దక్షుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సర్వేశ్వర తీర్థం ఉంది.

సలేశ్వరం:
నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట తాలూకా
లింగాల మండలం
అప్పాయిపల్లి గ్రామానికి కి 30 కిలోమీటర్ల దూరంలో

ఈ మార్గంలో వెళ్లే భక్తులకు ప్రకృతి లో చూడదగ్గ ప్రదేశాలు ఏడురంగుల చెరువు, మనిషి ఎత్తున ఉండే పుట్టలు, గూర్జగుండం, మోకాళ్ళ కురువ, చూడదగ్గ ప్రదేశాలు…

@సలేశ్వరానికి దారి@

1.లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మిదుగా కాలినడకతో పాటు ట్రాక్టర్ మాత్రమే అతికష్టం మీద సలేశ్వరం చేరుకునేవీలు ఉంటుంది.
2.అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ చేరుకోవాలి.మన్ననూర్ 20 కి.మీ.దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా… అటు నుంచి అడవి మార్గంలో 40 కి.మీ.దూరంలో ఉన్న రాంపూర్ పెంటవద్దకు వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడ నుండి 4 కి.మీ.దూరం కోండలు,లోయలు,గుట్టల మధ్య కాలినడకతో సాహసయాత్ర అనంతరం లింగమయ్య దర్శన భాగ్యం కలుగుతుంది.

!! ఓం నమః శివాయ !!!

About The Author