ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్…


ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి శ్రీ బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా సీఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి శ్రీ జి. జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు శ్రీ రాజశేఖర్ రెడ్డి, శ్రీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్ ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్, జెఇఇ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‘‘ఇంటర్మీడియట్ తో పాటు ఎమ్సెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ ప్రొక్యూర్ మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు.

‘‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Hon’ble CM Sri K. Chandrashekar Rao has issued instructions to the Officers concerned to get done free of cost the Re-verification and Re-counting of papers of all the Intermediate students who failed in the examinations. The CM said that in case if the students who passed prefer Re-verification and Re-counting it would be done as per the prevailing norms and regulations. The CM further instructed that the Re-verification and Re-counting process should be expedited and completed as early as possible and should be followed with conducting the advanced supplementary examinations so that the academic year is not lost. The CM entrusted the responsibility of conducting Re-verification, Re-counting and advanced supplementary examination to Education Secretary Sri B. Janardhan Reddy. The CM also instructed the officers to evolve a strategy for smooth conduct of examinations and evaluation without any problems for the future. Chief Minister expressed shock over suicides of few students who failed in the intermediate examination describing it as most unfortunate. The Chief Minister has appealed that no student should resort to committing suicide as failing in intermediate is not meant to end the life.

Chief Minister held a review meeting on Wednesday at Pragathi Bhavan on the subject of events that happened following the declaration of intermediate results. Minister for Education Sri G. Jagadeesh Reddy, Educational Secretary Dr. B. Janardhan Reddy, Secretary Board of Intermediate Education Dr. A. Ashok, Chief Advisor to the Government Sri Rajeev Sharma, CMO officers Sri Rajashekar Reddy, Sri Bhoopal Reddy participated in the review meeting. The review covered the issues of intermediate examination papers valuation, results declaration and the events that took place subsequent to results declaration. The CM took several important decisions in the review meeting.

“This year 9.74 lakhs of students appeared for the intermediate examination. Out of these 3.28 lakhs failed in the examination. Some students and their parents are of the opinion that during the process of addition of marks mistakes took place resulting in less marks than expected and hence they failed. However earlier for several years. This is the reason why the facility has to be provided for Re-verification of papers of failed students free of cost. The Re-verification could be done in the subject in which the student failed and in the same Re-counting would also be done. In case if any student who passed the exam also desires Re-verification then it would be done on payment of fees as per the earlier and prevailing procedure. The Re-verification and Re-counting process should be completed at the earliest. In view of the fact that the students will have to attend to NEET and JEE countrywide Entrance Tests, the advanced supplementary examinations should also be conducted at the earliest and also the results to be declared at the earliest” said the Chief Minister issuing clear instructions to the officers.

“The government is facing problems every time whenever intermediate examinations and EAMCET Tests are conducted. The government, the students and their parents had to face a headache every time. This needs to be avoided. It has to be examined whether the responsibility of conducting examinations could be entrusted to an autonomous body. The best practices elsewhere in other states and other countries are to be studied for implementing in our state. In future examinations are to be held in such a manner so that there would not be any problems. For this the process has to begin from now onwards” said the Chief Minister.

The CM also enquired about the identification of outsourcing agencies and their capacity to process the data of the intermediate students as well as the declaration of the results. The officers briefed the CM that the identification was done based on the tender process and the responsibility was entrusted to the company which quoted the lowest tender. The capacity of the outsourcing agencies who submitted tenders was assessed by technology experts and experienced board members and everything was done as per the norms and procedures.

“It is unfortunate and highly saddening to note that few students who failed in the intermediate examination committed suicides. I felt extremely unhappy and deeply hurt over such incidents. Suicides of students are most unfortunate. Intermediate education is not the whole life. Failing in examination does not amount to failing in life. Life is precious. Though one fails in the examination, there will be plenty of opportunities. According to one’s own interest and capacity, one should make use of opportunities and identify a profession of their liking. They should stand up in life and be courageous. If you commit suicide you will be leaving behind a lot of sorrow to the parents. I appeal to every student not to commit suicide” said the CM.

About The Author