మతిమరుపు వ్యాధితో మరిచిపోయిన డబ్బు ఎంతో తెలుసా …?

మతిమరుపు వ్యాధితో మరిచిపోయిన డబ్బు ఎంతో తెలుసా …?

అక్షరాలా 10 లక్షలకోట్లు .. నమ్మశక్యంకాని నిజం..
మతిమరుపునకు తీవ్ర రూపాలే డిమెన్షియా, అల్జీమర్స్‌. వాటి బాధితులు జపాన్‌లో రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆదేశం ఆందోళన చెందుతోంది. ఆ మతిమరుపు కారణంగా పెద్దమొత్తంలో ఆస్తులు ఎక్కడివక్కడే పేరుకుపోవడమే దీనికి ప్రధాన కారణం. వారి వారసులు ఆస్తులు వివరాలు తెలీక సతమతమవుతున్నారు. ఈ వ్యాధి బాధితుల వల్ల 143 ట్రిలియన్‌ యెన్‌ల సొమ్ము నిరుపయోగంగా ఉండిపోయింది. డైచి లైఫ్ రిసెర్చ్ సంస్థ చేసిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం జపాన్ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతుకు సమానమని వెల్లడించింది.
‘ఇది ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ సమస్యకు తగ్గట్టు సామాజికంగా కొత్త నిబంధనలు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఆర్థిక సలహాలు ఇచ్చే వ్యవస్థలు కూడా డిమెన్షియాతో బాధపడేవారికి తగిన పరిష్కారం చూపించాల్సి ఉంది’ అని టోక్యోలోని కియో విశ్వవిద్యాలయానికి చెందిన కొహీ కొమమురా సూచించారు. తమ ఆస్తులను పెద్ద మొత్తంలో పొదుపు చేసే దేశాల్లో ఈ సమస్య పెద్ద తలనొప్పిగా పరిణమించింది. జపాన్‌లో 15 శాతం ఆస్తులు ఈక్విటీలు, పెట్టుబడుల కింద పెడుతున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, న్యాయవాదులను ఫైనాన్షియల్ గార్డియన్స్‌గా నియమించుకొనేలా ప్రజలను ప్రోత్సహించాలని అక్కడి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

About The Author