శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన పని చూసారా …

శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన పని చూసారా …

 

https://www.youtube.com/watch?v=lMRyYJYAo-g

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని పొలాలను పరిశీలించారు.

కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు పరిపాలన లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి అన్నారు.

నేడు చంద్ర బాబు పాలన బ్రిటిష్ వారి పాలనలా ఉంది అని అభివర్ణించారు. రాష్ట్రంలో చంద్ర బాబు పాలన కాదు రాక్షస పాలన నడుస్తోంది అన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్ర బాబు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు అని మండిపడ్డారు.

రాజధాని కి రైతులు ఎవ్వరూ స్వచ్ఛంద గా భూములు ఇవ్వలేదు చంద్ర బాబు మరియు మంత్రులు రైతులను బెదిరింపులకు గురిచేసి వారి నుంచి లాకున్నారు అని విమర్శించారు.

అక్రమ మైనింగ్, ఇసుక రవాణా, ల్యాండ్ మాఫియా లో చంద్ర బాబు మరియు మంత్రులు అవినీతి లో కూరుకుపోయారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అమరావతి నిర్మాణం రాజ్యాంగ విరుద్ధం గా, రాజధాని నిర్మాణం పేరు తో స్విస్ బ్యాంక్ ఒప్పందంలా ఉంది అన్నారు. చంద్ర బాబు రాజధాని నిర్మాణం కోసం పంటలు పండే సారవంతమైన భూములను ఎలా తీసుకుంటారు ప్రశ్నించారు.

రైతుల పాలిట చంద్ర బాబు భూ బకాసురుడు అని అన్నారు. వ్యవసాయం చేయడం వృధా అని తెలిపిన ఏకైక వ్యక్తి చంద్ర బాబు అని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ తూరగా నాగభూషణం గారు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు, శ్రీ అడపా నాగేంద్ర గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ సన్యాసిరావు గారు,నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author