చెన్నై హోటల్స్ లో కుక్కమాంసం…
చెన్నై హోటల్స్ లో కుక్కమాంసం…
చెన్నైలో కుక్క మాంసం స్వాధీనంతో చెన్నై హొటళ్ళులో నాన్ వెజ్ పై అనుమానాలు తలెత్తాయి. చెన్నైలోని చాలా హోటల్స్ లో మటన్ బదులు కుక్క మాంసం తో చేసిన వంటకాలు పెడుతున్నారన్న అనుమానాలు నిజమని తేలిపోయింది..రాజస్థాన్ , కలకత్తానుంచి రోజూ కుక్కమాంసం వస్తోంది. రైల్వే పోలీసుల మామూలు తనిఖీలో ఇది బయటపడింది.
హోటళ్లకు విక్రయించేందుకు రాజస్థాన్ నుంచి చెన్నైకి తరలిస్తున్న సుమారు 1000 కిలోల కుక్క మాంసాన్ని చెన్నై ఎగ్మూరు రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి ఐస్ పెట్టెలో ఈ మాంసాన్ని పంపారు. దీనిపై ఓ వ్యక్తి చిరునామాను గుర్తించారు. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. గతంలో చెన్నై ఎగ్మూరు, సెంట్రల్ రైల్వేస్టేషన్లలో ఆరోగ్యశాఖ అధికారులు పలుమార్లు సోదాలు చేపట్టినప్పుడు నాణ్యత లేని మాంసం లభ్యమైంది. ఇప్పుడు ఏకంగా వెయ్యి కిలోల కుక్క మాంసం లభించడం కలకలం రేపుతోంది.