కిడ్నీలో బంగాళదుంపంత రాయి.. ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే…!

కిడ్నీలో బంగాళదుంపంత రాయి.. ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే…!

కరీంనగర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్‌ యూరాలజిస్టు డాక్టర్‌ నీల్‌ ఎన్‌ త్రివేది ఆయనకు వైద్య పరీక్షలు చేయగా.. ఎడమ మూత్ర పిండంలో పెద్ద పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 85 శాతం మూత్రపిండంలో రాయి విస్తరించి ఉన్నట్లు తేలింది. మూత్ర పిండం పనితీరు కొద్దిగా మందగించినా వైఫల్యం మాత్రం కాకపోవడంతో శస్త్ర చికిత్స చేసి రాయిని తొలగించారు. రోగి కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్‌ త్రివేది సోమవారం మీడియాకు తెలిపారు. కొన్నిసార్లు కిడ్నీల్లో రాళ్లు ఉన్నాసరే ఎలాంటి నొప్పి లక్షణాలు ఉండవని, కొన్నిసార్లు చిన్న రాళ్లకే ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. బాధితుడి విషయంలో చాలా కాలం నుంచి కిడ్నీలో రాయి ఉన్నాసరే.. రాయి పరిమాణం బాగా పెరగడంతో బాధితుడికి గత 15 రోజుల నుంచి కడుపులో నొప్పి సమస్య తలెత్తిందన్నారు. ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరు పరిశీలించడం ద్వారా సమస్యలు ఉంటే గుర్తించవచ్చునన్నారు.

About The Author