ఏపీ సచివాలయం నుంచి… ఫోని తుఫాను పై అత్యవసర సమీక్ష…
ఫోని తఫాను పై అమరావతి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆర్టీజీఎస్ నుంచి ఫోని సూపర్ సైక్లోన్ ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై కలెక్టర్లతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
ఫోని సూపర్ సైక్లోన్‌పై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఫోని సూపర్ సైక్లోన్ రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో.. ఒరిస్సాలోని పూరీ తీరాన్ని తాకవచ్చునని ఏపీఆర్టీజీఎస్ ఇచ్చిన అంచనాలపై నవీన్ పట్నాయక్‌తో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
ఒరిస్సా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్ పట్నాయక్‌కు తెలిపిన చంద్రబాబునాయుడు.
ఫోని సూపర్ సైక్లోన్ ప్రభావం ఒరిస్సాపై అధికంగా ఉండవచ్చునని ఏపీ ఆర్టీజీఎస్ అందించిన సమాచారాన్ని నవీన్ పట్నాయక్‌తో పంచుకున్న ఏపీ సీఎం…
ఇటువంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
గతంలో తుఫాన్ విపత్తు సమయంలో రూ.30 కోట్ల విలువైన మెటీరియల్‌ను ఒరిస్సాకు పంపించిన విషయాన్ని అధికారులకు గుర్తుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ఫోని సూపర్ సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని ఏపీ ఆర్టీజీఎస్ అంచనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చిన విపత్తుల నిర్వహణ ప్రత్యేకాధికారి వర ప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు.
120 క్యాంపులను నిర్వహిస్తున్నామని, ముగ్గురు ఐఎఎస్ అధికారులను ప్రత్యేకంగా సహాయ, ముందస్తు కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం నియమించామని ముఖ్యమంత్రికి తెలిపిన అధికారులు.
టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పనిచేస్తున్నట్టు వివరణ.
ఫోని సూపర్ సైక్లోన్ ముందుస్తు జాగ్రత్తలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేసారు…
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా చూడాలి.
మండల కేంద్రాలలో కాకుండా తుఫాన్ ప్రభావిత గ్రామాలలో సహాయ బృందాలను అందుబాటులో వుంచండి.
గతంలో ఈ బృందాలు మండల కేంద్రాల్లో ఉండిపోవడం వల్ల గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్యత్యేక బృందాలను నేరుగా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లోనే అందుబాటులో ఉంచండి.
ఇళ్లు, చెట్లు పడిపోయినప్పుడు ఈ బృందాలు తక్షణం స్పందించి రంగంలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది.
ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాలన్నా ప్రత్యేక బృందాలు ఎక్కడికి అక్కడే అందుబాటులో ఉండాలి.
ముఖ్యంగా తాగునీరు, ఆహార సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయండి.
స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న చోటే తుఫాన్ బాధితులకు అవసరమైన ఆహార సరఫరా అందేలా చూడండి.
కూరగాయలు, నిత్యావసరాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో అందుబాటులో ఉండేలా చూడండి.
తాగునీరు, పాల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి.
విశాఖ కేంద్రంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు పాలు, ఇతర నిత్యావసరాలు అందించేలా చూడండి.
విపత్తుల సమయంలోనే ప్రభుత్వ యంత్రాంగం గరిష్టస్థాయిలో శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాలి.