రఫెల్ డీల్ గురించి ఖచ్చితమైన సమాధానం…

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ABP న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఫెల్ డీల్ గురించి ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ రఫెల్ డీల్ పై విచారణ జరపాలని పదే పదే అనవసర ప్రచారం చేస్తున్నారు. రఫెల్ డీల్ అభియోగం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా సీబీఐ విచారణ ఎలా చేస్తుంది. ఇంత చిన్న విషయం కూడా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలియకపోతే మేము ఏమి చేయాలి.రఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో పిల్ రిజిస్టర్ అయ్యి విచారణ జరుగుతుంది. దీన్ని పెద్దది చేసి అసత్య ప్రచారం చేసినా ఖచ్చితంగా నిజం యటపడుతుంది. మేము రాహుల్ గాంధీకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ప్రజలే మీకు తగిన విధంగా బుద్ధి చెపుతారు.మేము రఫెల్ డీల్లో ఎలాంటి లంచాలు తీసుకోలేదు. మీ దగ్గర తగిన సాక్ష్యాలు ఉంటే ఇప్పుడే బయటపెట్టండి.మాకు భయం లేదు,మేము ఎలాంటి తప్పు చేయలేదు.కేసు పూర్తి అయ్యాక సాక్ష్యాలుతో అవసరం ఉండదు. మేము ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.ప్రజలకు కాంగ్రెస్ చరిత్ర బాగా తెలుసు అలాగే బీజేపీ చరిత్ర తెలుసు మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రజలకు నిజానిజాలు బాగా తెలుసు, ఎన్ని అబద్ధాలు చెప్పినా వారు నమ్మరు అని బీజేపీకి భరోసా ఉంది.

About The Author