కుక్క కు సాంప్రదాయంగా అంత్యక్రియలు…

కుక్క కు సాంప్రదాయంగా అంత్యక్రియలు..

మనిషి చచ్చిపోతేనే రెండో రోజుకుకూడా ఇంట్లో శవాన్ని ఉంచరు. అటువంటింది పెంపుడు కుక్క చనిపోతే కుటుంబ సభ్యులు వచ్చేవరకు ఐస్ బాక్స్ లో చనిపోయిన కుక్కను ఉంచి సాంప్రదాయంగా అంత్యక్రియలు. చేశారు. పుదుచ్చేరి కోరిమేడుకు చెందిన దేవరాజ్‌ టెంపోడ్రైవర్, ఇతని భార్య సుజాత.వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె లేదనే లోటును తీర్చుకునేందుకు 12 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆడకుక్కను తెచ్చుకుని జాకీ అనే పేరుపెట్టి ప్రేమగా పెంచుకుంటున్నారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జాకీకి చికిత్సలు చేయించినా కోలుకోలేక సోమవారం ప్రాణాలు విడిచింది.పనిపై రెండురోజులుగా తిరుపతిలో ఉంటున్న దేవరాజ్‌కు భార్య సమాచారం ఇవ్వగా తాను వచ్చేవరకు జాకీని ఐస్‌బాక్స్‌లో ఉంచమని భార్యాబిడ్డలకు చెప్పి హుటాహుటిన మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్నాడు. జాకీ మరణాన్ని తట్టుకోలేక కుటుంబమంతా కన్నీరుమున్నీరైంది. మనిషి మరణం తరువాత చేయాల్సిన సంప్రదాయాలన్నీ జాకీకి చేసిన దేవరాజ్‌ తన సొంత స్థలంలో జాకీని ఖననం చేశారు.

About The Author