మల్లేశం….ఇది సినిమా కాదు…జీవితం….


మల్లేశం….ఇది సినిమా కాదు…జీవితం….
కండలు తిరిగిన హిరోలు లేరు…
ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లు లేరు…
చేనేత వాళ్ళ కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన సినిమా మల్లేశం …

పట్టుదల, కృషి, స్నేహం, గ్రామీణం,
అమ్మ ప్రేమ,ఆత్మాభిమానం, విమర్శలు,
నాన్న కాఠిన్యంలో బిడ్డ బాగు,
అంత కష్టంలో ఉన్నా నమ్మి వఛ్చిన భార్యనుపువ్వుల్లో పెట్టి చూసుకోవడం ,
ఆడపిల్ల పుడితే అమ్మ అని పీల్చుకోవడం
అదే ఆసుయంత్రాన్ని అమ్మతో మీట నొక్కించడం,
తిట్టిన నాయనను ఆశీర్వదించమనడం,
కుటుంబవిలువలు కోల్పోతున్న ఈ తరుణంలో, విలువలను చూపించిన అద్భుత సుందర దృశ్యమాలిక మల్లేశం…

:::::::: మల్లేశం అసలు జీవిత కథ :::::::::
చింతకింది మల్లేశంది నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేలసార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేలసార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు. తనకొచ్చిన ఐడియాను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. వాళ్లు నిరుత్సాహపరచినా తన ఆశయం నెరవేర్చకోవడంకోసం హైదరాబాద్ వచ్చాడు. పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తూ ఆసుయంత్రాన్ని పార్టులు పార్టులుగా తయారుచేశాడు. మొత్తం యంత్రం తయారుచేయడానికి ఏడేళ్లు పట్టింది

అమ్మ పేరు మీదనే 2000ల సంవత్సరంలో లక్ష్మీ ఆసు యత్రం కనిపెట్టాడు.
2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది.
ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది.
అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు పొందారు .

About The Author