హిందుత్వం విశ్వవ్యాప్తం…


నేడు గల్ఫ్ దేశాలంటే ఇస్లామిక్ దేశాలు మాత్రమే అనే వాదన చాలా బలంగా వినిపిస్తున్నారు, కానీ 1400 సం.ల ముందు ఇస్లామ్ లేనే లేదు.
ఈ గల్ఫ్ దేశాలలో ఇస్లామ్ లేని ఆ రోజుల నుండీ వారి ఒరిజినల్ సంస్కృతి ఏమిటి?
క్రైస్తవమా? లేదా హిందుత్వమా?
హిందుత్వమా… ఛాన్సే లేదు, హిందుత్వం గల్ఫ్ దేశాలలో ఉండడం అసంభవం అనుకునే నేటి యువతకు కనువిప్పు ఈ ఆర్టికల్.
గల్ఫ్ దేశాలలో వేల సం.ల నుండీ వస్తున్న హిందూ సంస్కృతులు:
(Note: మేటర్ చదువుతూ, మధ్యలో ఇవ్వబడిన లింకులు కూడా ఓపెన్ చేసి వెబ్ సైట్లను పరిశీలించండి. సాక్ష్యాలు కళ్లకు కనిపిస్తాయి.)
ఇక మేటర్ లోకి వెళదాం…
అరేబియా తదితర ప్రాంతాలలో వేల సంవత్సరాలుగా *శివ పూజ* జరిగింది.
శివుని ఆరాధనా పద్ధతులు, ఇత్యాదులను మనం నేటికీ అక్కడ గమనించవచ్చు.
*ఉత్తర ఇరాక్ – ఇరాన్*
(అస్సిరియా – మెసపటోనియా సంస్కృతి) :
BCE 1800 నాటికి ఇక్కడ(అస్సీరియా ప్రాంతంలో) *అసుర* అనే రాజ్య వంశం విస్తరించింది. వీరిని సంస్కృతంలో అసురులు (రాక్షసులని మరో పేరు) అని పిలిచారు.
ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని అసురులు దక్షిణ ఇరాక్, ఈజిప్ట్ వరకు విస్తరించారు. అక్కడ దక్షిణ ఇరాక్ లోని బాబిలోన్ సంస్కృతి – ఈ అసుర సంస్కృతి కలిసిపోయాయి.
అసురుల రాజులలో ప్రసిద్ధి చెందినవాడు అషుర్ – బని – పాల్ (అసుర వనపాలుడు) ¹
ఈ సంస్కృతినే “ఆస్సీరియా – మెసపటోనియా సంస్కృతి” అని చరిత్రకారులు పిలిచారు.
Link1:
https://www.ducksters.com/h…/mesopotamia/assyrian_empire.php
(ఈ వెబ్ సైట్ లో మెసపటోనియా నాగరికత గురించి కొంతవరకు సమాచారం అందుబాటులో ఉంది.)
Link2:
https://www.iflscience.com/…/4000yearold-artifacts-reveal-…/
మెసపటోనియన్లు(అసురులు), బాబిలోనియన్లు బహుదేవతారాధకులు.
అసురుల రాజ చిహ్నము నంది. అసురుల్లో ఒక దేవుని పేరు #ఈశర.
ఈశ్వర శబ్దానికి వికృతి. అయితే ఈ పేరు గల దేవతా స్త్రీని *అసుర* లేక *అన్సర* పేరుతో నంది వాహనుడిని రాజ దేవతగా పూజించేవారు.³
Link3:
అస్సీరియా రాజ్యం గురించిన సమాచారం యూట్యూబ్ హిస్టరీ చానల్ వారి రిఫరెన్స్:
https://youtu.be/L57PMVVdsSI
అసురుల దేవతలందరూ అతీంద్రియ శక్తులు కలవారే. అమరులు కూడా!
విశ్వం యొక్క అనేక దిక్కులకు, అంశలకు అధిదేవతలు వీరు.
*ఇష్టర్* అనే పేరుతో ఇష్టదేవతను కొలిచేవారు.
*ఈయ* అనే పేరుతో జ్ఞానము, మంత్రము, స్తోత్రములతో దేవతను కొలిచేవారు.
దేవాలయముల ద్వారా భక్తులు దేవుని దర్శించేవారు. దేవాలయములలో గర్భగుడిలోకి కొందరిని మాత్రమే ప్రవేశం ఉండేది. నిత్య దేవతార్చన, నైవేద్య అర్పణ జరిగేది.
నెలకు ఒకసారి ఉత్సవం జరిగేది. ప్రతి సంవత్సరం దేవుని కళ్యాణం జరిపేవారు.
#కుర్దులు:
ఈ ప్రాంతంలోనే ఉన్న మరొక ప్రసిద్ధ జాతి – కుర్ధులు. వీరి భాషలో నీటిని “ఆప” అని పిలుస్తారు.
ఆపః అంటే సంస్కృతంలో జలము అని అర్థం.
కుర్దు భాష, సాంస్కృతిక పద్ధతులను ఇంకా విశదంగా విశ్లేషించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది.⁴
Link4:
Kurdish Language Script
https://www.omniglot.com/writing/kurdish.htm
Link:5
https://en.m.wikipedia.org/wiki/Kurds
#సిరియా:
*సూర్య* శబ్దానికి వికృతి నామమే – సిరియా.
నంది వాహనుడైన శివుని ముద్ర ఉన్న పురాతన నాణేలు ఇక్కడ దొరికాయి.
శివన్ అనే పట్టణం, శివ అనే మాసం(నెలని) వీరి పూర్వీకులు ఉపయోగించారు.
ఈ “శివ” మాసంలోనే మోజెస్(బైబిల్ సృష్టికర్త మోషే) అనే వీళ్ల పూర్వీకుడు టెన్ కమాండ్మెంట్స్(పాత నిబంధన) రాశాడు.
#టర్కీ:
టర్కీ ప్రాంతంలో శివుని పూజ జరిగేది అనడానికి ఆనవాళ్లు దొరికాయి.
టర్కీ లోని ఒక ప్రముఖమైన పట్టణం పేరు #శివస్.
నేటికీ విలసిల్లుతున్న ఇస్తాంబుల్ పట్టణంలో Mosque of Sivas శివుని మసీదు నేటికీ ప్రసిద్ధమైనదే.(5)
https://ramanan50.wordpress.com/…/haran-in-turkey-shiva-co…/
అలాగే నేటికీ ఇక్కడ ప్రసిద్ధమైన మరొక ఊరు – అంతాలయ లేదా అంతాల్య.
అంతాలయము అంటే మరణ – ఆలయము.
శివుడు లయకారకుడు కనుక వారు ఆ పేరు పెట్టుకున్నారనడంలో ఆశ్చర్యం ఏముంది!?
నేడు ఉన్న మరొక ఊరు – సంసాన్ లేక స్మశాన. స్మశాన నివాసి కూడా రుద్రుడే కదా!
టర్కీలో మరో విచిత్రం స్త్రీలు సంతానం కొరకు చెట్లను ఆశ్రయించి, కోరికలు తీర్చమంటూ వృక్ష పూజ చేసేవారు.
కన్యలు మంచి భర్త దొరకాలని వివాహము కొరకు చెట్లను పూజించేవారు.
సంతానం కోరుకునే స్త్రీలు చిన్న ఊయలలను చెట్లకు కట్టేవారు. వారు ఆ చెట్టుకి దారాలు, పవిత్రమైన వస్త్రాలని కట్టి, మొక్కుకునేవారు.
ఈ పద్ధతులు టర్కీ, దక్షిణ రష్యా, కజకిస్తాన్ ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతున్నవి.
ఇవన్నీ పాశ్చాత్య స్త్రీలకు అర్థం కావు కానీ భారతీయులకు ఇవి ఆచార సంప్రదాయాలు.
ఈ సంప్రదాయాలు యూదులు, అరబ్బులలో కూడా వ్యాపించి ఉన్నవి.
Link ?
http://www.turkishculture.org/…/cer…/ancient-beliefs-222.htm

About The Author