మనసున్న పోలీస్ అన్న కు…సలామ్

ఎల్బీనగర్…

మనసున్న మారాజు ఆ సిఐ

తన జీవితం…జీతం…మొత్తం…పేదరికం లో ఉండే పెద్దలకే…అంటున్న సిఐ

 పేదలకు పెద్దపీట..వేస్తున్న…మనసున్న..పోలీస్ అన్న కు…సలామ్

ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న అంజనపెళ్లి  నాగమల్లు…

తనకు లేకున్నా ఇతరులకు పెట్టె గుణం 100 లో ఏ ఇద్దరికో, ముగ్గురికో ఉంటుంది.. వారిలోఈ ట్రాఫిక్ సీఐ నాగమల్లు..ఒకరు

ఒక పేద కుటుంబానికి  రెండు గదుల ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో లోన్ తెచ్చి  ఇల్లు కట్టించి ఇచ్చిన ట్రాఫిక్ సిఐ..

మరో కుటుంబానికి బ్యాంకులో నగలు పెట్టి అప్పు తెచ్చి ఇల్లు కట్టించాడు.

ఆయన మాటల్లో…

సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం , చిల్పకుంట్ల గ్రామంలో పంతం లక్ష్మమ్మ  వయసు 70 సంవత్సరాలు ముగ్గురు కూతుర్లు భర్త రామస్వామి ఊరిలో పశువులు కాయగా వచ్చిన డబ్బులతో ఇల్లు గడిసేది ఇద్దరు కుతుర్ల పెళ్ళిల్లు చేయగా మూడవ కూతురు పద్మ 21 సంవత్సరాల భర్తలేని అభాగ్యురాలకు మూడు సంవత్సరాల పాప ఉంది. లక్ష్మమ్మ భర్త పది సంవత్సరాల క్రితం చనిపోగా తను చిన్నకూతురు పద్మ , మనవరాలు తో సహా ముగ్గురు ఒక పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఆమెకు కళ్ళు కనిపించక పోవడం కూతురు ఒక్కతే కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులతో జీవనం గడిసేది. కళ్ళు కనిపించక పోవడంతో మనవరాలితో పూరిగుడిసెలో ఉన్న సమయంలో పాములు, తేళ్లు, కుక్కలు వచ్చినా ఎలాంటి రక్షణ లేదు. ఇటీవల కురిసే వర్షాలకి గుడిసె మొత్తం కురియడంతో వర్షంలో వణుకుతూ జీవనం గడపటం నా దృష్టికి రావడంతో వారికి ఒక ఇంటిని నిర్మించాలి అనుకున్నాను. కానీ గత 8 నెలల క్రితమే మాట్టే చంద్రమ్మ 90 సంవత్సరాల వృద్ధురాలు తనకొడుకు మాట్టే రామచంద్రయ్య 55 సంవత్సరాలు పుట్టుకతో వికలాంగుడు వీరికి నా బంగారు నగలు ముతూట్ ఫైనాన్స్ లో పెట్టీ ఒక ఇల్లు కట్టించడం జరిగింది,ఆ ఫైనాన్స్ బాకీ ఇంకా తీరలేదు. కానీ లక్ష్మమ్మ గారి పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉంది ఏది ఏమైనా ఇల్లు కట్టించాలి అని నిర్ణయించుకొని బ్యాంక్ లో లోన్ తెచ్చి ఒక లక్ష రూపాయలతో ఇటుక, సిమెంట్, రేకులు, కిటికీలు, దర్వాజ, కొని తెచ్చి మెస్త్రిని పెట్టి ఒక నెల రోజుల్లో రెండు గదుల ఇంటిని నిర్మించి , వారికి కొత్తబట్టలు పెట్టి ,కొత్త ఇంటిని వారికి అప్పగించడం జరిగింది. ఆ క్షణంలో వారి కళ్లల్లో ఆనందం చూస్తే ఇన్ని రోజుల నా బాధ అంతా మర్చిపోయాను. *” మనం చేసే చిన్న సహాయం ఒక పేద కుటుంబానికి కొండంత అండ అవుతుంది”.

About The Author