మహా విలీనం… కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం…
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లను కలిపి ఒక బ్యాంకుగా చేయనున్నారు, దీంతో 17.95 లక్షల కోట్ల బిజినెస్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సిండికేట్ బ్యాంకు,కెనరా బ్యాంక్ విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్ తో నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనుంది…
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా విలీనమై, ఐదవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా ఏర్పడనుంది…
అలహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా అవతరించబోతోంది…
ప్రస్తుతం ఇండియాలో 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.
#MegaBankMerger #NirmalaSitaraman #FinanceMinister