టీ20 ఫార్మాట్ కు మిథాలీ గుడ్‌బై…


భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 2,364 పరుగులు చేశారు. కెప్టెన్‌గా 32 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. రిటైర్మెంట్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. 2006 నుంచి టీ20లు ఆడుతున్నట్టు తెలిపారు. యువ క్రికెటర్లను ప్రొత్సహించడంతో పాటు, వయసు రీత్యా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుని 2021 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు మిథాలీ వెల్లడించింది.

About The Author