రామనాథ స్వామి దేవాలయం, రామేశ్వరం ,తమిళనాడు…
రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం.
ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు “జ్యోతిర్లింగం”గా కొలువబడుతున్నాడు.
ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధి నేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించు కోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలను కుంటాడు. రాముదు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిషించాలనుకొని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.
ఈ దేవాలయ ప్రధాన దైవం “రామనాథస్వామి” (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది.ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం.
రాముడు “విశ్వలింగాన్ని” మొడట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
ఆలయ సముదాయంలో మరియు రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు:
ఇచట రామనాథస్వామి మరియు విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్ తో వేరుచేయబడినాయి.ఇచట విశాలాక్షి,పర్వతవర్ధిని,ఉత్సవ విగ్రహం,శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుప్పు మండపం, సుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం మరియు నంది మండపం.
రామేశ్వరం తీర్థములు :
భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు (పవిత్ర జల భాగాలు) ఉన్నాయి.స్కాంద పురాణం ప్రకారం, వాటిలో 24 ముఖ్యమైనవి.ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సఖ్య రాముని యొక్క అమ్ములపొదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం “అగ్ని తీర్థం”. అది బంగాళా ఖాతం సముద్రం.
చరిత్ర:
భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమబాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడింది. ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధముగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.
ఇక్కడి ఇసుకలింగం (సైకత లింగం) శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది. రావణుడు బ్రహ్మమనుమడు కనుక బ్రాహ్మణుడు కనుక అతడిని రణరంగమున సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని అందుకు పరిహారంగా మహామునుల అదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ లింగప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు నిర్ణీతముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తరువాత కైలాసగిరి నుండి తాను తీసుకు వచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేక పోయినందుకు మిక్కిలి ఆగ్రహించాడు. అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ముందుగా హనుమ తీసుకు వచ్చిన లింగానికి పూజలు చేసి తరువాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించాడు అని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ పై కథనానికి మహర్షి వాల్మికి రచించిన మూలరామాయణంతో కాని తమిళంలో కంబర్ రచించిన కంబరామాయణంతో కాని సమన్వయం కుదరడం లేదు. తరువాత 15వ శతాబ్దంలో తులసీదాసు వంటి వారి చేత వ్రాయబడిన రామాయణాలతో దీనికి సమన్వయం కుదరవచ్చు.
ప్రాతఃకాల మణిదర్శనకాలంలో పవిత్రమైన స్పటిక లింగదర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడినదని పురాణకథనఅలు వివరిస్తున్నాయి.
రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం) అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
రామేశ్వరములొ విశేషాలు:
రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభిషనాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
చేరుకొనే విధానం:
చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళడానికి Egmore Railway Station నుంచి ట్రైన్స్ ఉన్నాయ్ అండి.
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన, బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్లో కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది