ఈ బైక్‌… చాలా కాస్ట్‌లీ గురూ

ఈ బైక్‌ ఖరీదు రూ.17 లక్షలు, 1300 సీసీ సామర్థ్యం, సింగిల్‌ సీట్, గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. లీటర్‌కు 5 కిలోమీటర్ల మైలేజీ, మాడిఫైడ్‌ సైలెన్సర్ల ఖరీదుకే రూ.1.50 లక్షలు, చెవులు దద్దరిల్లే శబ్ధం. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లపై చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పట్టుకున్న ఈ బైక్‌ మలక్‌పేట్‌కు చెందిన యువ వ్యాపారి సమీర్‌ అహ్మద్‌దిగా గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహి ల్స్‌ రోడ్‌ నెం.2 కేబీఆర్‌ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వారాంతాల్లో మాత్రమే సదరు యువకుడు ఈ బైక్‌ను బయటికి రేసింగ్‌లో పాల్గొంటాడు. ఒక్కసారి ఈ బైక్‌ రోడ్డెక్కిందంటే పెట్రోల్‌ కోసం రూ. 7 వేలు ఖర్చు చేయాల్సిందే. మోటారు వాహనాల చట్టానికి విరుద్దంగా రైడింగ్‌ చేస్తున్న ఈ బైక్‌ను జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు.

About The Author